CHEVELLA : ఎమ్మెల్యే కాలే యాదయ్య రండి కుర్చీలో కూర్చోండి 

నవాబ్ పేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం లో వింత ప్రదర్శన

On

పదేండ్ల నుండి కూడా పెట్టిన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారిండ్రు

పార్టీ మారలేను అని చెప్పిన కాలే యాదయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రతి సమావేశాలకు రండి 

మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మోస పోయిండ్రు

ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

IMG-20251001-WA0004

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్  మండలంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే పరిధిలో జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరవుతారని సభ లో వారికోసం ఒక కుర్చీని అలాగే ఉంచి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా ఎప్పుడు వస్తారు మా సారు అన్నట్టుగా ఎదురుచూస్తు అలాగే ఉండిపోయిన తీరు సమావేశం పూర్తయ్యే వరకు అందరిలో ఒక హాస్యంగా మిగిలిపోయింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ... పది సంవత్సరాలుగా పార్టీలో ఉండి కుటుంబంలో ఉన్న అందరికీ పదవులు ఇచ్చుకుంటూ అనేక విధాలుగా స్థిరపడి ఆస్తులు కాపాడుకోవడానికి ఎవరు ఊహించని విధంగా పార్టీ మారిన కాలే యాదయ్య రండి నాయకులు మీకోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని అన్నారు. పది సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట తిరిగిన నాయకుల,కార్యకర్తల చెంప చెల్లుమనిపించి తగిన బుద్ధి చెప్పి పేరని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ముందు నేను పార్టీ మారలేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారుగా ఇప్పటినుంచి నియోజకవర్గంలో జరిగే పార్టీ ప్రతి సమావేశాలలో పాల్గొనాలని సూచించారు.నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీ తీరెంటో క్లుప్తంగా  అర్థమయ్యిందని, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తప్పకుండా బుద్ధి ఏ రోజులు దగ్గరలోనే ఉన్నాయని  అన్నారు.ఈ కార్యక్రమంలో... మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Publisher

NAMASTHE BHARAT

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise