DUNDIGAL : పారిశుద్ధ్య కార్మికుడి పై దాడి
రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన కార్మికులు భారీ ట్రాఫిక్ జామ్
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి చేశారు చాయ్ కెఫీ యాజమాని శ్యామ్. రోడ్డు పై చెత్తను వెయ్యదని హెచ్చరించినందుకు దుడ్డు సురేందర్, బాలమని, కొమ్ము వెంకటలమ్మల పై రక్తం వచ్చేట్టు దాడి పాలుపడ్డాడు, గాయాలపాలైన కార్మికులను బహదూరపల్లిలోని ఎస్.వి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై స్పందించిన తోటి కార్మికులు, వారి సంఘాలు చాయ్ కెఫీ షాపును ధ్వంసం చేసినా, అనంతరం గండిమైసమ్మ ప్రధాన రహరి చౌరస్తా పై బైఠాయించి అందోళనకు దిగారు.
దాడికి పాలుపడినా చాయ్ కెఫీ ఓనర్ శ్యామ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. దింతో నర్సాపూర్ బాలానగర్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయంపై దుండిగల్ మున్సిపల్ కమీషనర్ స్పందించి, దాడిని ఖండించారు.
గాయాల పాలైన వారిని పరామర్శించారు, ఇలాంటి హేమైన చర్యకు పాలుపడిన వ్యక్తిని రిమాండుకు పంపించాలి పోలీసులకు సూచించారు. ఇక నుండి రోడ్డు పై చెత్త వేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. శ్యామును పోలీసులు అదుపులోకి తీస్కొని విచారిస్తున్నట్లు సమాచారం.
Publisher
About The Author
Advertise

