Tag
hydraa
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆక్రమణలను తొలగించిన హైడ్రా
Published On
By Shiva Kumar Bs
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా
Published On
By Shiva Kumar Bs
నాట్ టూ ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని ఫిర్యాదు దారులకు తప్పుద్రోవ పట్టిస్తున్న అధికారులు
HYDRAA పై భారం వేసి చేతులు దులుపుకున్న రెవిన్యూ
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
జ్యూడిషియల్ వ్యవస్థను మోసం చేస్తూ తెలంగాణ గౌరవ హై కోర్టునే తప్పు దోవ పట్టిస్తూ అసైన్డ్ తోపాటు ప్రభుత్వ భూమి కబ్జాకు పాలుపడ్తున్నారు కొందరు ప్రబొద్దులు. 2024వ సంత్సరంలో 75 గజాల నాలుగు ప్లాట్లలకు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని దుండిగల్ మున్సిపాలిటీకి TSBPASSకు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంలేరని కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. అది అడ్మిషన్ సమయంలోనే ఆకేసుకు "నో ఆర్డర్ యజ్ టూ కాస్ట్" అంటూ పిటీషన్ సస్పెండ్ చేస్తూ డిస్పోజ్ చేసింది. చింతపండు చచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా, బుద్ది మార్చుకోకుండా కొన్నేళ్లు సైలెంటుగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం మారగానే మల్లి కోర్టును ఆశ్రయించి తహసీల్దార్ నోటీసును సవాల్ చేస్తూ న్యాయస్థానం నుండి స్టేటస్-కో ఆర్డర్ తెచ్చుకొని, ఆర్డర్ యొక్క నిబంధనలు ఉల్లంగిస్తూ, నిర్మాణ పనులు చేపడుతూ., జులై 2025లో ముగిసిన స్టేటస్-కోను చూపిస్తూ అసైన్డ్ భూమితో పాటు, దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు అక్రమార్కులు. Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్
Published On
By Shiva Kumar Bs
Hydrabad Disaster Response and Asset Protection Agency (హైడ్రా ) మరో సారి గాజులరామారంలో దూకుడుగా వ్యవహరించింది. దాదాపు 1200 గజాల స్థలానికి ఫెన్సింగ్ వేసింది. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామా ప్రభుత్వ భూమి కలిగి ఉన్న సర్వే నెంబర్ 329/4 నుండి 329/10లో సర్కారీ గైరన్ భూమిని కబ్జా చేసి మహాదేవపురం లేఔట్ తయారు చేసి కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు లేఔట్ వేసిన బిల్డర్స్. HYDRAA : హైడ్రాకు కంప్లైంట్
Published On
By Shiva Kumar Bs
అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ప్రగతి నగర్ వైకుంఠదామని అభివృద్ధి చెయ్యాలని సీపీఐ అధ్యర్యంలో బుద్ధ భవనులో హైడ్రా ప్రజావాణిలో అడిషనల్ కమిషనరుకు వినతిపత్రం అందించారు. BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ
Published On
By Shiva Kumar Bs
కూకట్ పల్లి మండలంలోని అంబిర్ చేరువు వద్ద బతుకమ్మ నిమజ్జనలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోపోవడం పై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. PUSPA : పుష్ప సీన్ రిపీట్
Published On
By Shiva Kumar Bs
ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి
ఇందిరమ్మ ఇళ్ల మాటున మట్టి దందా
మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
Published On
By Shiva Kumar Bs
శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్ రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
Published On
By Shiva Kumar Bs
రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్ మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.... హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
Published On
By Shiva Kumar Bs
భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు
వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా
రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు
కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు
2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం. ముంపు సమస్యకు పరిష్కారం
Published On
By Shiva Kumar Bs
దోమలగూడ, బాగ్‌లింగంపల్లిలో పర్యటించిన హైడ్రా కమిషనర్
ఆశోక్‌నగర్‌లో వరద కాలువ విస్తరణకు కమిషనర్ ఆదేశం
నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీతో పాటు.. దోమలగూడలోని గగన్‌మహల్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తమ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వర్షం పడితే వణికిపోవాల్సి వస్తోందని, బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముందు వాపోయారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న తమ కాలనీలో పెద్దమొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఖాళీస్థలంలోంచి హుస్సేన్‌సాగర్ నాలాలోకి వరద నీరు చేరేదని.. అక్కడ పైపులైను దెబ్బతినడంతో సమస్య తలెత్తుతోందని చెప్పారు. 450 ఇళ్లు వరద నీటిలో మునుగుతున్నాయని స్థానికులు వాపోయారు. గురువారం, శుక్రవారం వరుసగా హైడ్రా కమిషనర్ వచ్చి సమస్య తీవ్రతను పరిశీలించడం, పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కోట్ల విలువ చేసే పార్కులను కాపాడిన హైడ్రా
Published On
By Shiva Kumar Bs
పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా బుధవారం కాపాడింది. దాదాపు 1600 గజాల వరకూ ఉన్న ఈ భూమి విలువ రూ. 16 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం, మూసాపేట సర్కిల్ పరిధిలోని సనత్‌నగర్ కోపరేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్లో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్లతో ఈ లే ఔట్‌ను వేశారు. ఇందులో 1200 గజాల స్థలాన్ని పార్కులకోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్రమణలకు గురౌతున్నట్టు మోతినగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా.. పార్కు స్థలంగా గుర్తించి వెంటనే ఆక్రమణలను తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు
Published On
By Shiva Kumar Bs
మేడ్చల్ గ్రామంలో సర్వే నంబర్లు 879, 881 పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ అనుమతులు పొందడమే కాకుండా, చెరువులోనే నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారని గత నెలలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని. కానీ చర్యలు తీసుకోకపోవడంతో, సోమవారం అదనపు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి మేడ్చల్ మున్సిపల్ మేనేజర్‌కు పూర్తి ఆధారాలతో పిర్యాదు అందజేశాం అన్నారు.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ అలాగే నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ., శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, మేడ్చల్ గ్రామంలో పెద్ద చెరువుకు ఆనుకొని సర్వే నంబర్లు 879, 881లో 24.31 ఎకరాల్లో (Proc. No.1064/MED/plg/HMDA/2022) విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మాన్యువల్ అనుమతులు హెచ్ఎండిఏ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు పరిధిలో విల్లాల నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వడానికి కారణం, BRS పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాదాపు ₹100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడమేనని ఆరోపించారు.
ఇప్పటికే చెరువులో 30 వరకు విల్లాలు అక్రమంగా నిర్మించబడుతున్నా, ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎమ్మెల్యేల సహకారమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే BRS 2ఎమ్మెల్యేల అక్రమ పెట్టుబడులపై దర్యాప్తు జరిపి, మేడ్చల్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో మాన్యువల్ అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులపై విజిలెన్స్ విచారణ జరపాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చెరువును పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, పి.బి. శ్రీనివాస్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
