Tag
Vote Chor
రంగారెడ్డి 

బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ

బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ విభాగంగా పనిచేస్తుందని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసిసి ఇన్చార్జి  చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. బిజెపి ఓటు చోరీ కి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 కోట్ల మంది సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీ చ్చా నాయక్  అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి వంశీచంద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Read More...
మేడ్చల్ 

VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి

VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి పార్టీలో ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని పార్టీ పటిష్టతకు శక్తిమేర కృషి చెయ్యాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్  పిలుపునిచ్చారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఇంటి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రమేష్ బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో  పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
Read More...

Advertisement