పట్టుదలతో గ్రూప్-1
డీపీఓగా ఎంపికైన ఖమ్మం జిల్లాకు చెందిన బొప్పన అనుష
గతంలోను ఎల్‌ఎల్‌బీలో రెండు స్వర్ణ పతకాలు సంధించిన అనుష
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన బొప్పన అనుష పట్టుదలకు ప్రతిభ తోడై ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 112వ ర్యాంకు, మల్టీ జోన్-1 పరిధిలో 62వ ర్యాంకు సాధించి డీపీఓగా ఎంపికయ్యారు. ఈ విజయం ఆమె కఠోర శ్రమకు, అంకితభావానికి నిదర్శనం తెలిపారు వారి కుటుంబీకులు.
విద్యా నేపథ్యం, కృషి అనుష విద్యాభ్యాసం ఒక పట్టుదలతో కూడిన ప్రయాణం. ఆమె తొలుత బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ న్యాయశాస్త్రం అభ్యసించి, అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. అందులో ఆమె ఏకంగా రెండు స్వర్ణ పతకాలను (GOLD MEDALS) అందుకున్నారు. ఈ విజయాల స్ఫూర్తితోనే గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమై, తొలి ప్రయత్నంలోనే ఉన్నత ర్యాంకు సాధించారు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు అంకితభావంతో చదివిన అనుష విజయంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా అంజనాద్రి రెసిడెన్సీ, వెంకట రమణ కాలనీ, గోకుల్ ప్లాట్స్, కూకట్‌పల్లి, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అనుష తల్లిదండ్రులు బొప్పన చంద్రశేఖర్ రావు, బొప్పన పద్మావతి, ఆమె భర్త ఎం.సంతోష్‌లు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.
Publisher
About The Author
Advertise

Related Posts
