Tag
Two Kids Died Fall in Well
మహబూబాబాద్ 

విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య-స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అందరు వారి బంధువులు చనిపోవడంతో వేరే గ్రామానికి వెళ్లారు. వీరు ఇద్దరు ఇంటివద్ద ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయబావి వద్ద ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. బావి వద్ద చెప్పులు బట్టలు ఉండడంతో గ్రామస్తులు వెతకడంతో ఇటికాల రితిక్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది.
Read More...

Advertisement