ప్రొబిషనరీ ఎస్ఐలకు రాబోవు రోజులలో నిర్వహించే విధుల గురించి దిశా నిర్దేశం
పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందుతున్నచేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్
గత కొన్ని నెలల నుండి పోలీస్ స్టేషన్లో నేర్చుకున్న విధుల గురించి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని, ఒక రోల్ మోడల్ గా ఉండాలని సూచించారు. నూతన టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని, రాబోవు రోజులలో టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలు పూర్తిగా విని వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డయల్ 100 కు వెంటనే రెస్పాండ్ అయి త్వరగా సంఘటన స్థలానికి చేరుకోవాలని సూచించారు.
అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజల మన్ననలు పొందే విధంగా విధి నిర్వహణ ఉండాలన్నారు. సైబర్ నేరాలు, సామాజిక రుక్మతలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తరచుగా గ్రామాలను సందర్శించి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడనే గ్రామాలలో పరిష్కరించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొబిషనరీ ఎస్ఐలు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.