NAMASTHEBHARAT
నారాయణపేట్  

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి* 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి*    నారాయణపేట్ జిల్లా :తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని  నారాయణపేట  జిల్లా కలెక్టరేట్ లో  ఈ నెల 17 న  ఉదయం 10 గంటలకు నిర్వహించే జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళ  వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో ఎవరికి ఇచ్చిన బాధ్యతలను  వారు సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఆమె లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏవో జయసుధ, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read...
Telangana 

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్న TGSPDCL సహాయక డివిజనల్ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేశారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ సందర్భంగా అతనికి, అతని బంధువులకు చెందిన 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్ ప్రముఖ ప్రదేశంలో ఒక ఇల్లు, ఐదు అంతస్తుల భవనం, రెండు ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన "ఆంథర్ కెమికల్స్” అనే రసాయన కంపెనీతో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లు రూ.2.18 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో కొనసాగుతోందని అధికారులు స్పష్టంచేశారు.
Read...
హైదరాబాద్ 

అక్రమ నిర్మాణాలను తొలగించాలి

అక్రమ నిర్మాణాలను తొలగించాలి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని  అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు. అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్  కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.  కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి,  తదితరులు పాల్గొన్నారు.
Read...
హైదరాబాద్ 

డివిజి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం

డివిజి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో నివసించే పి.శేఖర్(65) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడు. ఈ విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించరు. జి.రవి, సిహెచ్.భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, సతీష్ కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.
Read...
హైదరాబాద్ 

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.
Read...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించరు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ., కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.రవి, భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read...
మేడ్చల్ 

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ఫతే నగర్ డివిజన్ పరిధిలోని  పిట్టల బస్తీలో  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు  కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను  కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.
Read...
మేడ్చల్ 

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

అంత్యక్రియలకు ఆర్ధికసాయం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతూ పి.శేఖర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
Read...
మేడ్చల్ 

ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు

ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు కుకట్పల్లి : గ్రీన్ హిల్స్ రోడ్డులో గల బహుల అంతస్తుల సముదాయలైన రెయిన్భో విష్టాస్ రాక్ గార్డెన్, మెరినా స్కై, రేయిన్భో విష్టా పేస్ 1 సంఘాలు సంయుక్తంగా శాసనసభ్యులు మాదవరం కృష్ణారావును కలిసి తమ ప్రదానసమస్య గ్రీన్ హిల్స్ రోడ్డు మీద పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించ వలసినదిగా కోరడం జరిగినది. దాదాపు 15 వేల మంది నివసిస్తున్న ఈ సముదాయాల నుండి మరియు ఇందులో ఉపాదికోసం రోజు వచ్చే 3వేల పైచిలుకు మహిళలు  నిత్యం వేల సంఖ్య లో రోడ్డు కు అటువైపు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రానున్న కాలంలో కొత్తగా రాబోయే సముదాయల ద్వారా వేల సంఖ్యలో నివాసాలు రాభోతున్న తరుణంలో పాదచారుల కు ప్రదాన సమస్య కు పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించి రంగదాముని మార్గం నుండి మాధాపూర్ కు ప్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేసి  శాశ్వత పరిష్కారం చూపమని బండి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మూడు సముదాయాల సంఘాల సభ్యులు టి.సత్యనారాయణరెడ్డి, ఓంకార్ రెడ్డి, రామారావు, రామ్ తిలక్, సుమంత్ కుమార్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందించి తక్షణం సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేశారు.
Read...
రంగారెడ్డి 

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం మంగళవారం, అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీ సుభాష్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య జి. కిషోర్ కుమార్ (సెంటర్ ఫర్ ఎర్త్, ఎట్ మాస్ ఫియర్ సైన్సెస్ మరియు ఓషియన్, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ) విచ్చేసి విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడేది ఓజోన్ పొర. భూమిపై సకల జీవరాసులకు ప్రాణలను కాపాడుతున్నది కూడా ఓజోన్ పొరే. ఓజోన్ పొర అంటార్కిటికా ప్రాంతంలో దెబ్బతినడాన్ని 1975 సంవత్సరములోనే శాస్త్రజ్ఞులు గుర్తించారు. అది నానాటికి పలుచనవుతూ 1987 నాటికి తీవ్రంగా దెబ్బతినింది. అభివృద్ధి పేరుతో మనుషులు చేసే చర్యల వలన ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, రసాయనాలు, పకృతి వనరులు దుర్వినియోగం కూడా ఓజోన్ దెబ్బతినడానికి కారణాలు. ఓజోనును రక్షించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సెప్టెంబరు 16 నాడు ప్రపంచ వ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం భూమిపై ఉన్న సకల జీవరాసులకు కవచంగా ఉన్న ఓజోను పొరకు ఏర్పడిన నష్టాల గురించి ప్రజలకు వివరించి నష్ట నివారణ చర్యలు చేపట్టడమే" అని అన్నారు." ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను వాడకుండా చేసేందుకు, చూసేందుకు, ఆచరించేందుకు ప్రపంచ దేశాల మధ్య మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం సెప్టెంబరు 16న 1987 సంవత్సరములో కుదిరింది. ఐక్యరాజ్యసమితి వారు 1994లో రెజెల్యూషన్ పాస్ చేసి 1995 సెప్టెంబరు 16వ తేదీ నుండి ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం _ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్_. ఓజోన్ పొర భూమియొక్క స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత (Ultra Violet) కిరణాలను గ్రహిస్తుంది. ఓజోన్ ప్రధానంగా వాతావరణంలో రెండు  పొరలుగా ఉంటుంది. 1. భూమికి దగ్గరగా సుమారు రెండు అడుగుల ఎత్తులో ట్రోఫోస్ఫెరిక్ ఓజోన్. ఇది కాలుష్య కారకమైనది. పంటలపై దీని చెడు ప్రభావం ఉండి దిగుబడి తగ్దిపోతూ ఉంటుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులకు కారణభూతమౌతుంది. 2. స్ట్రాటోస్ ఫెరిక్ ఓజోన్. ఇది భూమికి 30 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండి సుమారు 25 నుండి 40 కిలోమీటర్ల మందంతో పాలపై మీగడలా భూమి ఉపరితలం చుట్టు ఉంటుంది. దీని ఫలితంగా అతినీలలోహిత కిరణాలు భూమిపై నేరుగా పడకుండ ఉంటాయి. ఆ పొరే కనుక లేకపోతే సకల జీవరాసులు నాశనమయ్యేవి. అంతేకాకుండా మానవులు చర్మవ్యాధులు, కంటి జబ్బులు, మానసిక వైకల్యం మరియు క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల బారిన పడటంతో పాటు సంతానోత్పత్తి కూడా తగ్గిపోయి ఉండేది. కనుక ఓజోన్ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తు తరాలకు మనము ద్రోహము చేసిన వారమవుతాము. ఓజోన్ పరిరక్షణకు క్లోరో, ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలు చేపట్టాలి. మొక్కలు, చెట్లను పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు చేపట్టాలి. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్తు వాడకాన్ని పెంచాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులను పరిమితంగా వాడుకోవాలి. సాధ్యమైనంత మేరకు వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి. వీలైనంతవరకు సేంద్రియ ఉత్పత్తులనే వాడాలి. మనం నిత్యం వాడే వస్తువులలో పర్యావరణ హిత వస్తువులనే కొనుగోలు చేయాలి. A. C ల వాడకాన్ని తగ్గించాలి. అలాగే H.C.F.C.S, C. F. C. S కు బదులు హైడ్రో కార్బనుతో తయురైనవే వాడాలి. సేంద్రియ ఎరువులనే ఉపయోగించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించి జనపనార లేదా పత్తితో తయారుచేసే సంచులను వాడాలి. RRR (Reduce, Recycle, Re use)ను అమలుచేయాలి. ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టి ఓజోనును రక్షించినచో అది మనలను రక్షిస్తుంది. ఇది మన అందరి సామాజిక బాధ్యత. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం చిత్తశుద్ధితో  కృషి చేసినప్పుడే ఈవిధమైన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి" అని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలందరిచేతా ఓజోన్ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీమతి పద్మజ, శ్రీ వీరేశం, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, అమ్మయ్య చౌదరి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Read...
మేడ్చల్ 

వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కీసర తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కీసర తహశీల్దార్ కార్యాలయం ముట్టడి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోవికలాంగుల పెన్షన్ రూ 6,000/- పెంచాలని మరియు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 4,000/- పెంచాలని,కండరాల క్షీణత కలిగిన వారికి రూ. 15,000/- ఇవ్వాలని అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కీసర మండల తహశీల్దార్ కార్యాలయం ముట్టడి చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS), చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS), మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS). ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల అయిన కూడా ఇప్పటివరకు పెంచిన పించన్లు ఇవ్వాలని కీసర మండల తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు.అనంతరం ఉప తహశీల్దార్ కి వినతిపత్రం అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే స్థానిక ఎన్నికలలో వికలాంగుల పోరాటం ఏంటో చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆవుల అల్లాజీ, టైగర్ నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, రాజు రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ ,ముత్యం బాలస్వామి, దత్తు, చోటు మోహన్రావు ,భాగ్యమ్మ ,బిక్షపతి గౌడ్ ,విక్టోరి గైడెన్,కీసర మండల MRPS అధ్యక్షులు మంచాల మహేందర్ మాదిగ, మండల  ఇంచార్జ్ బుడిగె జగన్ మాదిగ, ఉపాధ్యక్షులు తుడుం శ్రీనివాస్ మాదిగ, శీలం మల్లేష్ మాదిగ, బందెల పరమేష్ మాదిగ, నల్ల చంద్రయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Read...
రంగారెడ్డి 

హనీ ట్రాప్ తో వల... మనీ డిమాండ్ తో బుక్

హనీ ట్రాప్ తో వల... మనీ డిమాండ్ తో బుక్ అనారోగ్య సమస్యతో యోగ ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు కొద్ది రోజుల్లోనే యోగా గురువు తో మహిళలు క్లోజ్ మూవ్  క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ మరో రెండు కోట్ల రూపాయలు లేదా రెండు ఎకరాల భూమి కావాలని గట్టి డిమాండ్ గోల్కొండ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,(యోగ గురువు ) మిట్ట వెంకట రంగారెడ్డి పక్క ప్రణాళికతో ఆ ముఠాను పట్టుకున్న గోల్కొండ పోలీసులు ఆదివారం చేవెళ్లలో ఇది ఒక హార్ట్ టాపిక్  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ కేంద్రం లోని దామరగిద్ద వార్డ్ లో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి ఫామ్ హౌస్ ఉంది.ఇదే ఫామ్ హౌస్ లో వెల్నెస్ సెంటర్,యోగ ఆశ్రమం వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుంటాయి.ఈ ఫామ్ హౌస్ యజమాని చేవెళ్ల బిజెపి పార్టీ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి పై హనీ ట్రాప్ వల విసిరింది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమర్ అతని గ్యాంగ్. గత నెలలో ఇద్దరు మహిళలలకు ( రజిని, మంజుల ) ఆరోగ్యం బాగాలేదని తీసుకొని యోగ ఆశ్రమానికి వచ్చాడు ఈ హనీ ట్రాప్ బాస్ అమర్.అతి తక్కువ రోజుల్లోనే ఆశ్రమంలో ఉండడానికి వీరికి అవకాశం దొరికింది.పక్కా ప్రణాళికతో ఉన్న ఈ మహిళలు యోగ గురువు మిట్ట వెంకట రంగారెడ్డి తో సన్నిహితంగా ఉంటూ వివిధ రకాల ఫోటోలు వీడియోలను తీసి భద్రపరుచుకున్నారు.ఆరోగ్యం బాగాలేదు యోగతో ఆరోగ్యంగా ఉంటారని పంపిస్తే మీరు చేస్తున్న పనులేంటి ప్రతి ఫోటో వీడియో మా దగ్గర ఉన్నాయి మేము అడిగినంత ఇచ్చుకోకపోతే ఫోన్ లో ఉన్న ఈ ఫోటోలు వీడియోలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామంటూ బెదిరించారు.దిక్కుతోచని పరిస్థితిలో యోగా గురువు మిట్ట వెంకట రంగారెడ్డి పరుగు పరుగున అమర్ గ్యాంగ్ దగ్గరికి చేరాడు.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అమర్ గ్యాంగ్. చేసేదేమీ లేక రూ.. 25 లక్షల రెండు చెక్కులను ఇచ్చాడు.మరో కొంత వ్యవధి లోనే ఈ అమౌంట్ సరిపోదు మరో రెండు కోట్ల రూపాయలు ఇవ్వు,లేదా రెండు ఎకరాల భూమి ఇవ్వాలని,గోల్కొండ లో ఉన్న తారామతి భానుమతి రెస్టారెంట్ కు వచ్చి డబ్బులు ఇవ్వాలని గట్టి డిమాండ్ చేశారు అమర్ గ్యాంగ్.ఈ గ్యాంగ్ నుంచి ఏలాంటి బెడద లేకుండా ఉండాలంటే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు.తారామతి భానుమతి రెస్టారెంట్ కు వెళ్లి అమర్ గ్యాంగ్ తో మాటలు కలుపుతున్న సమయంలో పక్క ప్రణాళికతో ఉన్న పోలీసులు అమర్ గ్యాంగ్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.గోల్కొండ పోలీసులు హనీ ట్రాప్ కు పాల్పడ్డ రజిని మంజుల అమర్ మౌలాలి రాజేష్ లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ గ్యాంగ్ ఇలాంటి హనీ ట్రాప్ లు ఇంకా ఏవైనా క్రైమ్ కు పాల్పడ్డారా అనేదానిపై ముమ్మార దర్యాప్తు ప్రారంభించారు గోల్కొండ పోలీసులు. చేవెళ్లలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది.
Read...

About The Author

NAMASTHEBHARAT Picture