Tag
CHEVELLA
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#Samskruthi ఇంటర్నేషనల్ స్కూల్ లో బాలల దినోత్సవం
Published On
By Shiva Kumar Bs
విద్యార్థుల్లో సామాజిక బాధ్యత భావం పెంపొందించడమే లక్ష్యం
ఈ కార్యక్రమంతో సేవా వృత్తుల విలువ తెలుసుకునే అవకాశం
సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ శశిపాల్ రెడ్డి
నేడు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు : ప్రిన్సిపల్ రెహినా
చేవెళ్ల : బాలల దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధి పామెన గ్రామ శివారులోని గల సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో గురువారం కమ్యూనిటీ హెల్పర్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీ నిర్వహించారు. వైద్యులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, సైనికులు వంటి వేషధారణలతో చిన్నారులు భలే ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల డైరెక్టర్ శశిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సేవా వృత్తుల విలువను అర్థం చేసుకునే అవకాశం లభించిందన్నారు. నేడు ( శుక్రవారం ) కూడా బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ రెహీన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. RSS శతాబ్ది ఉత్సవాలు
Published On
By Shiva Kumar Bs
RSS శతాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం దగ్గర ప్రారంభమై పురవీధులు గుండా రహదారిపై సాగి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ వద్దకు చేరుకుంది. CHEVELLA : ఎమ్మెల్యే కాలే యాదయ్య రండి కుర్చీలో కూర్చోండి
Published On
By Shiva Kumar Bs
పదేండ్ల నుండి కూడా పెట్టిన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారిండ్రు
పార్టీ మారలేను అని చెప్పిన కాలే యాదయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రతి సమావేశాలకు రండి
మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మోస పోయిండ్రు
ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనీ ట్రాప్ తో వల... మనీ డిమాండ్ తో బుక్
Published On
By NAMASTHEBHARAT
అనారోగ్య సమస్యతో యోగ ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు
కొద్ది రోజుల్లోనే యోగా గురువు తో మహిళలు క్లోజ్ మూవ్
క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్
మరో రెండు కోట్ల రూపాయలు లేదా రెండు ఎకరాల భూమి కావాలని గట్టి డిమాండ్
గోల్కొండ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,(యోగ గురువు ) మిట్ట వెంకట రంగారెడ్డి
పక్క ప్రణాళికతో ఆ ముఠాను పట్టుకున్న గోల్కొండ పోలీసులు
ఆదివారం చేవెళ్లలో ఇది ఒక హార్ట్ టాపిక్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ కేంద్రం లోని దామరగిద్ద వార్డ్ లో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి ఫామ్ హౌస్ ఉంది.ఇదే ఫామ్ హౌస్ లో వెల్నెస్ సెంటర్,యోగ ఆశ్రమం వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుంటాయి.ఈ ఫామ్ హౌస్ యజమాని చేవెళ్ల బిజెపి పార్టీ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి పై హనీ ట్రాప్ వల విసిరింది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమర్ అతని గ్యాంగ్. గత నెలలో ఇద్దరు మహిళలలకు ( రజిని, మంజుల ) ఆరోగ్యం బాగాలేదని తీసుకొని యోగ ఆశ్రమానికి వచ్చాడు ఈ హనీ ట్రాప్ బాస్ అమర్.అతి తక్కువ రోజుల్లోనే ఆశ్రమంలో ఉండడానికి వీరికి అవకాశం దొరికింది.పక్కా ప్రణాళికతో ఉన్న ఈ మహిళలు యోగ గురువు మిట్ట వెంకట రంగారెడ్డి తో సన్నిహితంగా ఉంటూ వివిధ రకాల ఫోటోలు వీడియోలను తీసి భద్రపరుచుకున్నారు.ఆరోగ్యం బాగాలేదు యోగతో ఆరోగ్యంగా ఉంటారని పంపిస్తే మీరు చేస్తున్న పనులేంటి ప్రతి ఫోటో వీడియో మా దగ్గర ఉన్నాయి మేము అడిగినంత ఇచ్చుకోకపోతే ఫోన్ లో ఉన్న ఈ ఫోటోలు వీడియోలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామంటూ బెదిరించారు.దిక్కుతోచని పరిస్థితిలో యోగా గురువు మిట్ట వెంకట రంగారెడ్డి పరుగు పరుగున అమర్ గ్యాంగ్ దగ్గరికి చేరాడు.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అమర్ గ్యాంగ్.
చేసేదేమీ లేక రూ.. 25 లక్షల రెండు చెక్కులను ఇచ్చాడు.మరో కొంత వ్యవధి లోనే ఈ అమౌంట్ సరిపోదు మరో రెండు కోట్ల రూపాయలు ఇవ్వు,లేదా రెండు ఎకరాల భూమి ఇవ్వాలని,గోల్కొండ లో ఉన్న తారామతి భానుమతి రెస్టారెంట్ కు వచ్చి డబ్బులు ఇవ్వాలని గట్టి డిమాండ్ చేశారు అమర్ గ్యాంగ్.ఈ గ్యాంగ్ నుంచి ఏలాంటి బెడద లేకుండా ఉండాలంటే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు.తారామతి భానుమతి రెస్టారెంట్ కు వెళ్లి అమర్ గ్యాంగ్ తో మాటలు కలుపుతున్న సమయంలో పక్క ప్రణాళికతో ఉన్న పోలీసులు అమర్ గ్యాంగ్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.గోల్కొండ పోలీసులు హనీ ట్రాప్ కు పాల్పడ్డ రజిని మంజుల అమర్ మౌలాలి రాజేష్ లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ గ్యాంగ్ ఇలాంటి హనీ ట్రాప్ లు ఇంకా ఏవైనా క్రైమ్ కు పాల్పడ్డారా అనేదానిపై ముమ్మార దర్యాప్తు ప్రారంభించారు గోల్కొండ పోలీసులు. చేవెళ్లలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. 