Tag
YELLAMMABANDA
హైదరాబాద్ 

బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!

బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.! జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో  దౌర్జన్యం  పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు.! ఊర్లకు వెళ్తే ఇండ్లలలో దొంగలు పడతారు, కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ JNNURM హౌసింగ్ సముదాయంలో ఏకంగా ఇండ్లనే కబ్జాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసి అమ్మేసారు. తదనంతరం దొంగ డాక్యూమెంట్లు సృష్టించి మహిళ పైనే కోర్టులో కేసు వేశారు.
Read More...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండలో ఘనంగా సద్దుల బతుకమ్మ

ఎల్లమ్మబండలో ఘనంగా సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించబడింది, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ తారకరామా నగర్లో. స్థానిక కాలనీ ఆడపడుచులు, మహిళలు, పిల్లలు పూలతో అలంకరించిన బతుకమ్మలను సిద్ధం చేసి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. సాంప్రదాయ వేషధారణలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు.
Read More...
Telangana 

BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ

BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ కూకట్ పల్లి మండలంలోని అంబిర్ చేరువు వద్ద బతుకమ్మ నిమజ్జనలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోపోవడం పై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.
Read More...
హైదరాబాద్ 

అక్రమ నిర్మాణాలను తొలగించాలి

అక్రమ నిర్మాణాలను తొలగించాలి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని  అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు. అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్  కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.  కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి,  తదితరులు పాల్గొన్నారు.
Read More...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.!

ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.! 70-80 గజల్లో వెలుస్తున్న 6 అంతుస్తుల భవనాలు  జిహెచ్ఎంసి చట్టం 1955  ఇక్కడ వర్తించదా అంటూ స్థానికులు ఫైర్  పరోక్షంగా నిర్మాణాలకు సహకారం అందిస్తున్న అధికారులు అక్రమ భవనాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు   ఎల్లమ్మబండ ప్రాంతంలో జిహెచ్ఎంసి చట్టం 1955 వర్తించదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది కూకట్పల్లి సర్కిల్ 24 టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల వ్యవహార శైలిని చూస్తుంటే. కండ్ల ముందు అక్రమ నిర్మాణమని తెలిసినా… ఏం చేయలేని.. చేతగాని స్థితిలో ఉంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలని ఎవరైనా ఫిర్యాదు చేసిన, ఇటు మున్సిపల్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కంటి తుడుపు చర్యగా నోటీసు ఇస్తూ ఆ తర్వాత నిర్మాణానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఫలితంగా పిల్లర్‌తో మొదలై.. జీ+6 అంతస్తు వరకు వచ్చినా.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కండ్లు మూసుకుంటున్నది. కూకట్పల్లి జోనల్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే.. కూకట్పల్లి 0సర్కిల్‌ 24 ఆల్విన్ కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండలోని నాగార్జున స్కూల్ ఎదురుగ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా దాదాపు 80 గజాల స్థలంలో రెండు అక్రమ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. రోడ్డుపైకి  3 ఫీట్ల స్లాబును విస్తరించి జీ+6 నిర్మిస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడలేని దుస్థితిలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉంది.  ఈ విషయం స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగానికి తెలిసిన, ఒకవేళ ఎవరైనా జోనల్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. లాభం లేకుండాపోతుందని, స్లాం అంటూ వెనుకేసుకొని వస్తారని ఆరోపణలు ఉన్నాయి. కంటి తుడుపు చర్యగా నోటీసులు జారీ చేస్తారు తప్ప  అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోవడంపై అనేక విమర్శలు చేస్తున్నారు ఎల్లమ్మబండ వాసులు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చి వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.     
Read More...

Advertisement