ఇంట్లోకి వెళ్లి చైన్ స్నాచింగ్
వంట చేస్తూ ఉన్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు
ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగలు – పోలీసుల దర్యాప్తు ప్రారంభం
కొండకల్ గ్రామంలో ఘటన.. భయాందోళనలో గ్రామస్తులు
నింధితులను కఠినంగా శిక్షిస్తామన్న మోకిల సీఐ వీరబాబు
శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఉసిరిగడ్డ నారాయణ రెడ్డి భార్య ఇంట్లో వంట చేస్తున్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో వేసుకున్న బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో బాధితురాలు భయాందోళనకు గురైనట్లు తెలిపారు. వార్త తెలిసిన వెంటనే మోకిల సీఐ వీరబాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్రంగా పరిశీలించారు. పరిసర ప్రాంతాలలోని ప్రజల వద్ద వివరాలు సేకరించారు.
ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోనే చైన్ స్నాచింగ్ జరగడం విశేషమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ వీరబాబు మాట్లాడుతూ – “దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను త్వరలోనే గుర్తించి కచ్చితంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామస్తులు జాగ్రత్తలు పాటిస్తూ అపరిచితులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి” అని సూచించారు. ఇప్పటికే పోలీసులు దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Publisher
About The Author
Advertise

