Tag
KUKATPALLY
మేడ్చల్ 

ఘనంగా దసరా పండగ ఉత్సవాలు

ఘనంగా దసరా పండగ ఉత్సవాలు విజయదశమి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇంట్లో దసరా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Read More...
మేడ్చల్ 

కూకట్పల్లిలో బాపు జయంతి

కూకట్పల్లిలో బాపు జయంతి టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  బండి రమేష్ ఆధ్వర్యంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.  
Read More...
Telangana 

MIRAI : మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ సందడి

MIRAI : మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ సందడి మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లో సందడి చేశారు. మీమా జ్యువెలరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి షోరూంను కేపి.హెచ్.బి కాలనీలోని 3వ ఫేజ్ లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా Mirai Heroin Rithika Naik మాట్లాడుతూ., ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశం తాకుతున్న వేల...
Read More...
Telangana  హైదరాబాద్ 

అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి

అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి దేవి శరన్నవరాత్రి భాగంగా అమ్మవారిని ప్రతిష్టించిన మండపాలను దర్శించారు ప్రముఖ సేవవాది, సామాజికవేత్త అండే నాగ గణపతి (గని భాయ్). శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్టీఆర్ నగరులో జై మాత ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించారు. నేడు అమ్మవారని ప్రతిష్టించి మూడోవ రోజు కావడంతో అన్నపూర్ణ మాత రూపాన్ని భక్తులు...
Read More...
హైదరాబాద్ 

ప్రమాదాల నుండి రక్షించండి

ప్రమాదాల నుండి రక్షించండి కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ రోడ్డు సరైన డివైడర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు యాక్సిడెంటులు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం అయ్యేంతవరకు ఎదురుచూడకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కు కలిసి వినతి పత్రం...
Read More...
హైదరాబాద్ 

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.
Read More...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించరు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ., కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.రవి, భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ఫతే నగర్ డివిజన్ పరిధిలోని  పిట్టల బస్తీలో  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు  కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను  కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు

ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు కుకట్పల్లి : గ్రీన్ హిల్స్ రోడ్డులో గల బహుల అంతస్తుల సముదాయలైన రెయిన్భో విష్టాస్ రాక్ గార్డెన్, మెరినా స్కై, రేయిన్భో విష్టా పేస్ 1 సంఘాలు సంయుక్తంగా శాసనసభ్యులు మాదవరం కృష్ణారావును కలిసి తమ ప్రదానసమస్య గ్రీన్ హిల్స్ రోడ్డు మీద పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించ వలసినదిగా కోరడం జరిగినది. దాదాపు 15 వేల మంది నివసిస్తున్న ఈ సముదాయాల నుండి మరియు ఇందులో ఉపాదికోసం రోజు వచ్చే 3వేల పైచిలుకు మహిళలు  నిత్యం వేల సంఖ్య లో రోడ్డు కు అటువైపు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రానున్న కాలంలో కొత్తగా రాబోయే సముదాయల ద్వారా వేల సంఖ్యలో నివాసాలు రాభోతున్న తరుణంలో పాదచారుల కు ప్రదాన సమస్య కు పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించి రంగదాముని మార్గం నుండి మాధాపూర్ కు ప్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేసి  శాశ్వత పరిష్కారం చూపమని బండి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మూడు సముదాయాల సంఘాల సభ్యులు టి.సత్యనారాయణరెడ్డి, ఓంకార్ రెడ్డి, రామారావు, రామ్ తిలక్, సుమంత్ కుమార్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందించి తక్షణం సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేశారు.
Read More...
హైదరాబాద్ 

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.!

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.! ప్రశ్నించిన యువకుడిని హాస్టల్‌లోనికి వెళ్లి దాడి హాస్టల్‌ కిటికీలు తలుపులు పగలగొట్టిన అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ దాడికి పాలుపడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూకట్ పల్లి: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరంతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 3లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌పై అర్థరాత్రి జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్‌బీ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం తన గ్యాంగ్‌తో కలిసి మద్యం మత్తులో హాస్టల్‌ సమీపంలో వెళ్తున్న ఒక యువతిని వేధించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకటేష్‌ అనే యువకుడు వారిని అడ్డుకుని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ మాటలకు ఆగ్రహించిన గ్యాంగ్‌, వెంకటేష్‌పై దాడికి దిగింది.ప్రాణభయంతో వెంకటేష్‌ సమీపంలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లోకి పారిపోయాడు. అయితే, అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ అతడిని వదలకుండా హాస్టల్‌లోకి దూసుకెళ్లారు. కర్రలతో హాస్టల్‌ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, ఆ తర్వాత వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అనూహ్య ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. రాత్రి చదువుకుంటుండగా ఒక్కసారిగా కిటికీలు పగులగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్‌ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో  ఒక్కసారిగా భయానికి గురయ్యామని హాస్టల్‌ విద్యార్థులు భయంతో చెప్పారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం, అతని అనుచరులపై దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్‌ట్రెస్పాస్‌, అసభ్యకర వ్యాఖ్యల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదని, యువతులపై వేధింపులకు ఇదొక సంకేతమని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Read More...

Advertisement