Tag
Safety standards
Telangana 

భద్రతా ప్రమాణాలు పాటించండి - లేదంటే ఉక్కుపాదం తప్పదు

భద్రతా ప్రమాణాలు పాటించండి - లేదంటే ఉక్కుపాదం తప్పదు ప్రతి కార్మికుని ప్రాణం ఎంతో విలువైంది, కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే కౌన్సిల్ ఆఫ్ ఈహెచ్ఎస్ ప్రొఫెషనల్స్ (సిఈపి) ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణా తరగతులు ప్రమాదాల నియంత్రణ కొరకు పరిశ్రమలు కట్టుబడి ఉండాలని సూచనలు జారీ కుత్బుల్లాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ వై మోహన్ బాబు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో కౌన్సిల్ ఆఫ్ ఈ హెచ్ ఎస్ ప్రొఫెషనల్స్ ( సిఈపి ) ఆధ్వర్యంలో పలు పరిశ్రమల ఉద్యోగులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ తరగతులలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో ప్రతి కార్మికుడు భద్రత పట్ల శిక్షణ పొందేటట్లు యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ తరగతుల వల్ల ప్రమాదాల నివారణ చాలావరకు తగ్గుతుందని ఆయన అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చే నివేదికలు ముఖ్యం కాదని అన్నారు. ప్రతి పరిశ్రమ జీరో ప్రమాదాల స్థాయికి చేరినప్పుడే పరిశ్రమ 100% అభివృద్ధి సాధించినట్లు అవుతుందని ఆయన అన్నారు. భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని వారిపై ఉక్కు పాదం మోపుతుందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల శిక్షణ కొరకు కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఇంటర్నెట్లో భద్రత ప్రమాణాలపై విషయాలు తెలుసుకొని సైతం క్రింది స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వచ్చని ఆయన అన్నారు.కౌన్సిల్ ఆఫ్ ఈ హెచ్ ఎస్ ప్రొఫెషనల్స్ ( సి ఈ పి ) వారు నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వారిని అభినందించారు.
Read More...

Advertisement