ఖబర్దార్ లంబాడి వ్యతిరేకులారా

లంబాడలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది

On

  • 1976 సంవత్సరంలో ఇందిరా గాంధీ లంబాడీలను చట్టబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చారు
  • మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్  వైస్ ప్రెసిడెంట్ జరుపుల విజయ్ నాయక్


IMG-20250923-WA0073
 
లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీది అని అన్నారు. మంగళవారం స్థానిక మరిపెడ మున్సిపాలిటీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జరుపుల విజయ్ నాయక్ మాట్లాడుతూ,1976 కి ముందు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కాలేదు ఇది నిజాం పరిపాలన ఉండేది.ఆంధ్ర రాష్ట్రం 1956 సంవత్సరంలో మద్రాస్ నుంచి విడిపోయి తెలంగాణ హైదరాబాద్ ను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ గా అవతరించబడింది అప్పుడు ఆంధ్ర లో ఉన్న లంబాడా సుగాలి బంజారా వీరు ఎస్టీలుగా పరిగణించారు. ఈ ఆధారంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ బంజారా లంబాడాలను సోనియా గాంధీ  రాజ్యాంగబద్ధంగా 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారు ఎందుకనగా ఈ లంబాడాలకు ఒకే రకమైన వేషధారణ ఆహార అలవాటులు లిపి లేకపోవడం ఒకే రకమైన భాష కలిగి ఉండడం వల్ల వీరిని ఎస్టీ జాబితాలో చేర్చు చేశారు. 1831 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ గా గుర్తించబడ్డారు ట్రైబ్స్ అదే కాకుండా గోల్కొండ కోటలో ఇప్పటికీ బంజారా దర్వాజా మరియు హైదరాబాదులో బంజారాహిల్స్ బంజరులో ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని ఇప్పుడు బంజారాహిల్స్ గా చెబుతున్నారు. ఇదే కాకుండా చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో హథిరాం బాబాజీ ఒక బంజారా బిడ్డ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవకుడిగా ఇప్పటికీ అతని మఠము అక్కడే కలదు. వీటికి సంబంధించిన ఇంకా మరెన్నో ఆధారాలు మేము మీకు చూపియగలము ఇవన్నీ తెలుసుకోకుండా కావాలనే మా లంబాడ బంజారా పైన అనైక్యంగా రాజకీయ లబ్ధి కోసం దూసిస్తున్న వారిని మా గత చరిత్ర తెలుసుకోవాలని ఇతవు పలుకుతున్న. గిరిజన బిడ్డలమైన మేము.అన్నదమ్ములాగా జీవిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి కోసం స్వయం బాబురావు తేల్లం వెంకటరావు గిరిజన తెగల మధ్య గొడవ పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాను. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్ నాయక్ గిరిజనుల పట్ల ఎనలేని సేవలు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదే డోర్నకల్ ప్రజలు అంటే మా నాయకుడికి ఎనలేని ప్రేమ  మాకు ఎప్పుడు సమస్య వచ్చినా నేనున్నాను అని ప్రజల మధ్యకు వచ్చి సమస్యని వెంటనే పరిష్కరించి మా వెంట ఉండి నడిచే నాయకుడి పైన కావాలనే కుట్రపూరితంగా బంజారా జాతి సంఘాల విద్యార్థి నాయకులు కొంతమంది నాయకులు వారి స్వార్థం కోసం వాళ్ల మోచేతు నీళ్లను తాగి మా నాయకుడి పైన ఆధారాలు లేని నిందలను మోపుతున్నారు.కొంతమంది లంబాడీలపై లంబాడీలను ఆసరాగా చేసుకుని లంబాడ కుల జాతి సంఘాలు పెట్టుకుని ఈరోజు ఈ క్లిష్టమైన పరిస్థితిలో లంబాడీలు అందరూ ఏకతాటిపై నడవాల్సిన రోజున ఎవరి రాజకీయ లబ్ధి కోసం వారు లంబాడీల నాయకులను విమర్శించడం సబబు కాదని అలాంటి వారిని లంబాడీలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నదని హెచ్చరించారు. ఈ తరుణంలో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్  లంబాడీలకు అన్యాయం జరగవద్దని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఉన్న  బంజారా జాతి మేధావులు, మరియు అన్ని పార్టీల బంజారా ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ కలుపుకొని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ , తెలంగాణ ముఖ్యమంత్రి శ రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇలాంటి నాయకుని పట్టుకొని హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద బంజారాల ఆత్మీయ సభలో భాగంగా మన బంజారా జాతి బిడ్డలు అందరూ కలిసి మన జాతి కోసం  పోరాటం చేస్తున్న  తరుణంలో కొందరు బంజారా జాతి కుల సంఘాల నాయకులు మన బంజారా ముద్దుబిడ్డ 15 సంవత్సరాలు తన డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి ప్రజా సంక్షేమమే తన సంక్షేమం గా భావించిన అనునిత్యం గిరిజనుల హక్కుల పోరాటాలకై పాటుపడుతున్న మన అందరివాడు  తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వ విప్ డోర్నకల్స్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ జాతి ద్రోహి కాదు మన బంజారా జాతి మిత్రుడు.ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కానుంచి తెలంగాణలో ఉన్న బంజారా సుగాలి లంబాడాలకు ఆర్ అండ్ బి ఈఎంసి గా మోహన్ నాయక్ సార్,ఒక ఉమెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా సూర్య ధనంజయ్ ,తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సభ్యులుగా లక్ష్మీ రాథోడ్ , రిటైర్డ్ ఐఏఎస్ శరత్ సార్ ని రెడ్డికో చైర్మన్గా, మరి ఎన్నో ఉత్తమ పదవుల్లో మన బంజారా బిడ్డల్ని జాతిని గౌరవించి గుర్తించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మన ప్రియతమ నాయకుడు రామచంద్రు నాయక్  ఆధ్వర్యంలో ఈ అన్ని చెయ్యగలిగామని మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా 20 సంవత్సరాలు డోర్నకల్ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడే చేస్తారు అనీ మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. అలాంటిది వారిపై అనుచిత వాక్యాలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్న. కొందరు గిరిజన సంఘాల కుల నాయకులు వారు చేసిన అనుచిత వాక్యాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

Publisher

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise