అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరానని స్పష్టం
దేవి శరన్నవరాత్రి భాగంగా అమ్మవారిని ప్రతిష్టించిన మండపాలను దర్శించారు ప్రముఖ సేవవాది, సామాజికవేత్త అండే నాగ గణపతి (గని భాయ్). శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్టీఆర్ నగరులో జై మాత ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించారు. నేడు అమ్మవారని ప్రతిష్టించి మూడోవ రోజు కావడంతో అన్నపూర్ణ మాత రూపాన్ని భక్తులు అలంకరిచగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న గని బాయ్ ను, అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి మేమంటం బహుకరించారు. తదనంతరం గని మాట్లాడుతూ., దేవి శరన్నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉందని, భక్తిశ్రద్ధతో కొలిస్తే సింహవాహిని తప్పకుండా ఆశీర్వదిస్తుందని తెలిపారు. అలాగే ప్రజలందరూ ఎల్లపుడు సుఖశాంతులతో చల్లాగా ఉండాలని కనకదుర్గమ్మను కోరామని స్పష్టంచేశారు. ఈ అన్నప్రసాదంలో స్థానిక జర్నలిస్ట్ శివ కుమార్, గని భాయ్ టీం సభ్యులు వారి మిత్రబృందం పాల్గొన్నారు.
Publisher
About The Author
Advertise

