హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో అంటూ బతుకమ్మ ఆడిన మహిళలు
- భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు
- వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా
- రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు
- కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు
2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు గ్రహణంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
తెల్లవారు జాము నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజులరామరం గ్రామ సర్వే 307 ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో స్థలం నిర్మించిన దాదాపు 100కు పైగా నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.
కొన్ని చోట్ల ఖాళీగా నిర్మాణం చేపట్టి వదిలేసిన రూములను డిమాలిషన్ చేస్తా కొన్ని చోట్ల మాత్రం ఇండ్లలో సామగ్రి బయట పెట్టి కూల్చారు. ఈ బుల్డోజర్ యాక్షనుతో నిరుపేద బాధితులు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా చేపట్టిన ఈచర్యకు నిరసనగా కూలిపోయిన ఇళ్లలోని సామగ్రి, స్కూల్ పుస్తకాలు రోడ్డు పై పెట్టి బతుకమ్మ ఆడుతూ హైడ్రా పై పాట పాడుతూ తమకు జరిగిన అన్యాయాని వినిపించారు. కట్ చేసిన కరెంట్ తీగలను పట్టుకొని జేసీబీ ముందు బైఠాయించి ప్రభుత్వంపై వెతిరేక నినాదాలు చేశారు.
పెత్తరమసా పండుగ నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపై ఇంతకు దాడికి పాలు పడడం అన్యయామని ప్రభుత్వం పై ఆవేశం ఎలాగక్కారు. బడబాబులైన మల్లారెడ్డి, వర్టిక్స్, వాసవి లాంటి వారి పై చర్యలు తీసుకోకుండా మాలాంటి పేద వారి పై చర్యతిస్కునే మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీని మానవదృపద్ధం వదిలేశారు, మరి మాలాంటి పేదవారు మీకు కనిపించడంలేద అని హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు జారీ చేసి పేదప్రజల పక్షాన నిలుచేది కానీ రేవంత్ కాంగ్రెసులో ఎక్కడ చూసిన పేదల దౌర్జన్యం జరుతుందని ఆరోపించారు. తమ ఇండ్లు ప్రభుత్వం భూమిలో ఉంటే, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందో అలానే రేవంత్ సర్కార్ కూడా పట్టాలు జరిచెయ్యలని ప్రజలు డిమాండ్ చేశారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేయ్యాలని కోరారు.
సర్వే నెంబర్ 342 పై హైడ్రా పర్సనల్ ఇంట్రెస్ట్ ?
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సిల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో నిర్మాణాలపై చర్య తీసుకుంటామని అధికారులు తెలియజేసిన, మీడియా ప్రదినిధులను ఎవ్వరిని రానివ్వకుండా సర్వే నెంబర్ 342లో కూల్చివేతలు చేశారు అధికారులు. ఆల్రెడీ ఇండ్లలలో నివాసం ఉంటున్న వాటిని వదిలేస్తాం అని చెప్పిన అధికారులు, నివాసం ఉంటున్న వారి ఇంట్లోని వస్తువులు బయట పెట్టి మరి డిమాలిషన్ ప్రక్రియ ప్రారంభించారు.
హైడ్రా పై రాళ్ళ దాడి..
కేవలం గాజులరామరం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చెయ్యాల్సిన ఆర్డర్ ఉండగా 342 సర్వే నెంబర్ లో ఆన్ఫిషియల్ బయట ప్రపంచనికి తెలియకుండా మీడియాను బ్యాన్ చేసి కూల్చుతున్నారని, తమకు తెలంగాణ గౌరవ హై కోర్ట్ ఆర్డర్ ఉన్న లెక్క చేయకుండా తమ పై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, పోలీస్, రెవిన్యూ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దాదాపు నలుగురు అధికారులకు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. దాడికి పాలుపడిన ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బస్తి లీడర్ అబిద్ ను అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనుకు తరలించారు.
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో..
కూల్చివేతలను వెతిరేకిస్తూ గాజులరామరం, బాలయ్య బస్తీలో మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో.. ఇప్పటికి మూడు సారలై ఉయ్యాలో.. ఎవరికి చెపుకుందుము ఉయ్యాలో.. అంటూ కొరస్ తీసుకొని, చప్పట్లు కొట్టాల్సిన చోట తలను కొట్టుకున్నారు, నవ్వుతూ ఆడాల్సిన చోట కన్నీరుతో ఆడారు. హైడ్రా పై ఉన్న కోపంమంత పాట ద్వారా నిరసన చేపట్టారు.
About The Author
Advertise

