PUSPA : పుష్ప సీన్ రిపీట్
కొందుర్గులో జోరుగా మట్టి రవాణ
ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి
ఇందిరమ్మ ఇళ్ల మాటున మట్టి దందా
మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ
ప్రభుత్వ భూముల నుండి పట్టపగలు మట్టి రవాణా జరుగుతుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలకేంద్రంలో అనుమతులు లేకుండా చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్,మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం కోల్పోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోంది.
అక్రమంగా మట్టి తవ్వకాలు
జేసీబీలు, ప్రొక్లెయిన్ల వంటి యంత్రాలతో చెరువులు, కుంటలు, గుట్టలు, పొలాల నుండి భారీ మొత్తంలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. టిప్పర్లు, లారీల్లో కొందుర్గు శివారు ప్రాంతాలకు మట్టిని తరలించి, వెంచర్లలో, నిర్మాణాలలో అక్రమంగా అమ్ముతున్నారు.
పరిశ్రమల అవసరాలకు మట్టి
బహుళ భవనాలు, కొత్త వెంచర్లలో మట్టి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, మట్టి మాఫియా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ, అసైన్డ్ భూములను కూడా ఈ మాఫియా టార్గెట్ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే టార్గెట్ చేస్తూ మామూళ్ల ఎర వేసి ఇరిగేషన్, రెవెన్యూ,మైనింగ్ అధికారులు మాఫియా నుంచి మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.అనుమతులు లేకపోయినా, చట్టాలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల అండతో కొందరు ప్రజాప్రతినిధులు మట్టి మాఫియాకు అండగా నిలుస్తున్నారని, దీనివల్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగడమే కాదు అక్రమ మట్టి తరలింపు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా నష్టపోతోంది. పర్యావరణ విధ్వంసం కూడా అని చెప్పవచ్చు.
Publisher
About The Author
Advertise

