రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
భాగ్యనగర్ కాలనీ నుండి గాజులరామరం వంద అడుగుల రోడ్డు కొరకు డిమాలిషన్
రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్ మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.
ఈ ప్రాంతాల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ కంపెనీస్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టారులో పని చేసేవారు ఎక్కువగా ఉండడంతో వీరు హైటెక్ సిటీ వైపు ప్రయాణాలు ఎక్కువగా కొనసాగిస్తారు. అదేవిధంగా సూపర్ మర్కెట్స్, షాపింగ్ మల్సూలో పనులు చేసుకునేందుకు వెళ్లేవారు ఆటోల్లో ప్రయాణం చేస్తుండడంతో ఈ రూట్స్ లో ఆటోల తాకిడి కూడా ఎక్కువే. ఇందులో భాగంగానే ఈ సమస్యను గ్రహించిన ప్రణాళిక అధికారులు హౌసింగ్ బోర్డ్ భాగ్యనగర్ కాలనీ నుండి గాజులరామరం వరకు వంద అడుగుల రోడ్డు వెయ్యలని గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతుంది.
శనివారం పట్టణ ప్రణాళిక అధికారులు మల్లి రంగంలోకి దిగారు, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కూడలి నుండి ఎల్లమ్మబండ గుడ్ చౌరస్తా వరకు రోడ్డు ఇరువైపులా అక్రమ షెడ్లను, రేకుల షెడ్లను, హోడింగ్ బోర్డులను, వాణిజ్య దుకాణాలను డిమాలిష్ చేశారు. మరికొందరికి కొద్దీ సమయం ఇచ్చి డెడ్ లైన్ విధించారు. ఈ అక్రమాల తొలిగింపు స్థానిక ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో జరిపారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.
About The Author
Advertise

