దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
ఆకట్టుకుంటున్న తీరొక్క పువ్వాలతో పేర్చి బతుకమ్మలు
విద్యుత్ దీపాల క్రాంతిలో వెలిగిపోతున్న అమ్మవారి మండపాలు
దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలోని దేవలయాలన్ని ముస్తాబైయింది. విద్యుత్ దీపాల క్రాంతులతో వెలిగిపోతున్నాయి. భక్తులు భారీగా దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దింతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి మాలను వేసుకున్నారు మహిళలు. భక్తిశ్రద్ధలతో ఈ దసరా పండుగను జరుపుకుంటామని తెలిపారు. అలాగే తీరొక్క పువ్వాలతో బతుకమ్మలను పేర్చి మహిళలు బతుకమ్మ ఆడారు. వివిధ రకాల రంగురంగుల పువ్వులు అందరిని ఆకర్షించాయి.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..
పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ పండగ అని జలగం నవ్య శ్రీ అన్నారు. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ్య శ్రీ మాట్లాడుతూ., సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలై చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్రమంత పండుగల జరుపుకుంటారని తెలిపారు.
About The Author
Advertise

