ఊరెళ్తున్నారా..జరభద్రం
దసరా సెలవుల్లో ఊరుకెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలంటున్న నారాయణ్ జిల్లా ఎస్పీ
- కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి
- కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
- దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట్ జిల్లా : దసరా పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా పండగ దృష్ట్యా చోరీల నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీలు నిర్విరామంగా ఏర్పాటు చేస్తున్నాం. ముందస్తు దొంగతనాల నిర్మూలన కొరకు క్రైమ్ పోలీసుల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తల్లి తండ్రులు తమ పిల్లలని గమనిస్తూ ఉండాలి అని చెరువులు, బావులు , కుంటాల దగరకు వెళ్లకుండా చూసుకోవాలి.దసరాకి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు.బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి. ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.
కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా నారాయణపేట పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670399 కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలనీ తెలిపారు.
About The Author
Advertise

