ప్రాణాలు కాపాడండి సారు !
కీసర ప్రధాన రోడ్డులో ఏర్పడ్డ గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం
అధికారులు చొరవ చూపి రోడ్డును బాగుచేయలంటున్న వాహనదారులు, స్థానికులు డిమాండ్
కీసర: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో ప్రధాన రొడ్డులో గుంత ఏర్పడి చాలా రోజులవుతుంది. కానీ గుంతను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని అంటున్న వాహనదారులు.ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తొస్తాయ అని అడుగుతున్నారు ప్రజలు.
నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న,ఏర్పడిన గుంతను మాత్రం పూడ్చే ప్రయత్నం చేయలేదు అధికారులు. వర్షం పడ్డప్పుడు గుంతలో నీరు చేరి చిన్నపాటి చెరువుల తయారవుతుంది. అటువైపు వెళ్లే వాహనదారులు భయంతో వెళ్లాల్సింది వస్తుందని వాపోతున్నారు.మలుపు దగ్గరగా గుంత ఉండటంతో ఎటువైపు నుండి ఏమవుతుందో అనే భయాందోలనలో ప్రయాణికులు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.
About The Author
Advertise

