ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 585 మంది మృతి

On
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 585 మంది మృతి

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్‌ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణువుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్‌  సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటి వరకూ 585 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంఘాలు తాజాగా తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 239 మంది టెహ్రాన్‌ వాసులు కాగా, 126 మంది భద్రతా సిబ్బంది, ఉన్నత అధికారులు ఉన్నట్లు సమాచారం

About The Author

Tags

Share On Social Media

Related Posts

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise