శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత.
On
శ్రీశైలం : శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అంతకు ముందు సీఎం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు
About The Author
Tags
Related Posts
Latest News
20 Oct 2025 11:42:15
RSS శతాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...