కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా

1600 గ‌జాల పార్కు స్థ‌లానికి క‌బ్జాల నుంచి విముక్తి, హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

On
కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా

పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను హైడ్రా బుధ‌వారం కాపాడింది. దాదాపు 1600 గ‌జాల వ‌ర‌కూ ఉన్న ఈ భూమి విలువ రూ. 16 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, మూసాపేట స‌ర్కిల్ ప‌రిధిలోని స‌న‌త్‌న‌గ‌ర్ కోప‌రేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్లో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్ల‌తో ఈ లే ఔట్‌ను వేశారు. ఇందులో 1200 గ‌జాల స్థ‌లాన్ని పార్కుల‌కోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్న‌ట్టు మోతిన‌గ‌ర్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా.. పార్కు స్థ‌లంగా గుర్తించి వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. 

IMG-20250919-WA0002

మ‌దీనాగూడ‌లో 600ల గ‌జాల స్థ‌లం

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లంలోని మ‌దీన‌గూడ విలేజ్‌లో పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దుశించిన 600ల గ‌జాల స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. శ్రీ అభ‌యాంజ‌నేయ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఫిర్యాదు మేర‌కు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయిలో హైడ్రా ప‌రిశీలించింది. పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు దాదాపు 600ల గ‌జాల స్థ‌లాన్ని కేటాయించ‌గా.. అందులో గోశాల పేరుతో కొంత భాగం, పిండి గిర్నీ కోసం మ‌రి కాస్త క‌బ్జా చేశారు. గోశాల‌లో ఉన్న ఆవుల‌ను ఇస్కాన్ టెంపుల్ వారికి అప్ప‌గించి అక్క‌డి ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది.

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise