ఎలుకల నివారణతో సత్ఫలితాలు  : ఏవో విశ్వాసరావు

రైతులకు బ్రోమోడయోలిన్ ఎలుకల ఎర్ర మందు పంపిణీ

On

  • పోడూరు మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ

IMG-20250919-WA0023

పోడూరు, సెప్టెంబర్ (18) : ఎలుకల నివారణతోనే సత్ఫలితాలు సాధించవచ్చని ఆ దిశగా ఎలుకల సామూహిక నిర్మూలన కార్యక్రమాన్ని రైతులు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పోడూరు మండల వ్యవసాయ అధికారి ఏవో ఎం.విశ్వాసరావు తెలిపారు. ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోడూరు మండలంలో 16 రైతు సేవ కేంద్రాలలో  ఎలుకల ఎర్ర (బ్రోమోడయోలిన్) మందు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగులో పంట నష్ట నివారణకు ఎలుకల నియంత్రణే మార్గమని, ఇందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని

 ఎలుకల కారణంగా పంట దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అన్నారు. పోడూరు గ్రామ సర్పంచి చెట్టిబత్తుల సువర్ణరాజు, పోడూరు సొసైటీ అధ్యక్షుడు దొమ్మేటి పురుషోత్తం, సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యుడు తోలేటి వేణు, టిడిపి పోడూరు మండల అధ్యక్షుడు రుద్రరాజు రమేష్ రాజు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రరాజు రవిరాజు, పోడూరు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రుద్రరాజు వరహాలరాజు తదితరులు మాట్లాడుతూ రైతుల లాభసాటి వ్యవసాయానికి ఎలుకల నియంత్రణకు రూ. కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని రైతులందరూ కలిసికట్టుగా ఒక్కసారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు అన్నారు. కార్యక్రమంలో ఏఈఓ చిరంజీవి,  వీఏఏ నాగలక్ష్మి, టిడిపి జనసేన బిజెపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise