బీసీలపై రెడ్డి జాగృతి సంస్థ కుట్ర

షాద్ నగర్ లో బీసీ జేఏసీ నేతల నిరసన

On
బీసీలపై రెడ్డి జాగృతి సంస్థ కుట్ర

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాంతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ హై కోర్టులో బిసిలకు 42 శాతం  రిజర్వేషన్లు తగ్గించాలని వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జేఏసీ బహుజన నేతలు ప్లక్ కార్డులు చెతపట్టుకొని రెడ్డి జాగృతి సంస్థ కు వ్యతిరేకంగా నినాదాలు ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ (ఈడబ్ల్యుసి) కోట పది శాతం విద్య ఉద్యోగాల్లో పెంచినప్పుడు దానిని బీసీలు ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు కానీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంపై రెడ్డి జాగృతి సంస్థ కోర్టుకు వెళ్ళడంలో అంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు వెంటనే ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు  అదేవిధంగా బిసిలకు విద్య ఉద్యోగాల్లో రాజకీయాలలో  కూడా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు సమాజంలో రెండు వర్గాల మధ్య అలజడి సృష్టించే విధంగా పూనుకుంటున్న రెడ్డి జాగృతి సంస్థ ను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు  ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ బహుజన నేతలు టీజీ.శ్రీనివాస్  రవీంద్రనాథ్ అర్జునప్ప  నర్సింలు గౌడ్ కరుణాకర్ చంద్రశేఖరప్ప వెంకటేష్ శంకర్ శ్రీను నర్సింలు నరేష్ రామలింగం శేఖర్ గౌడ్ వలిగ కృష్ణ బిజిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Publisher

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise