నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్

నకిలీలు విక్రయిస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా సరుకును స్వాధీనం చేసుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ 

On

  • వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా, టీమ్ అధికారులు తాండూరు పట్టణంలో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను అధికారులు గుర్తించారు.

IMG-20250919-WA0024

తాండూర్ పట్టణంలో మణికంఠ కిరాణా షాప్ యజమాని పి.వీరన్న షాప్ లో మొదట  టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా కల్తీ అల్లం వెల్లుల్లి లభించగా అతనిని అదుపులోకి తీసుకోని విచారించగ హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీమ్ దెగ్గర తీసుకుంటున్నట్లు చెప్పగా అతనిని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇందులో

 A1గా హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద సుమారు 166 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను  స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 కిలోల బాటిళ్లు 32, 1 కిలో బాటిళ్లు 6 ఉన్నాయి. అదనంగా 30 కిలోల కల్తీ అల్లం రెండు బస్తాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

A2గా ఎస్‌బిఐ సమీపంలో మణికంఠ కిరాణం యజమాని పి.వీరన్న  వద్ద 30 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ లభించింది. ఇందులో 500 గ్రాముల బాటిళ్లు 38, 200 గ్రాముల బాటిళ్లు 48, మరియు 100 గ్రాముల బాటిళ్లు 25 ఉన్నాయి.

మొత్తం 196 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తో పాటు, 60 కిలోల పాడైన అల్లం ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పేస్ట్ లో హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నకిలీ పేస్ట్ ను ఆహార పదార్థాల్లో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు.

పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం తాండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ నకిలీ సరుకు ఎక్కడ తయారు అవుతుంది, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటువంటి నకిలీ ఉత్పత్తులను నివారించడానికి భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని తెలియజేయడం జరిగింది

About The Author

Advertise

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise