ఎండుతున్న నాటని మొక్కలు.!
పటించుకొని అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు - కూకట్ పల్లిలోని అంబిర్ చెరువు సుందరికర్ణలో భాగంగా తెచ్చిన మొక్కలు
- పర్యవేక్షణ లేమి కారణంతో వృధాగా ఎండుతున్న పచ్చనితోరణం
- మండిపడుతున్న పర్యావరణ ప్రేమికులు
- కనారని లోకల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్
శేరిలింగంపల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి సిర్కిల్ 24 పరిధిలోని ఎల్లమ్మబండ శివారులో ఉన్న అంబిర్ చెరువు సుందరికర్ణలో భాగంగా తెచ్చిన మొక్కలు నాటకుండా వృధాగా వదిలేశారు అధికారులు.
పచ్చదనంతో కళకళలాడాల్సిన మొక్కలు ఎండిపోతున్నాయి. నాటాల్సిన పచ్చనితోరణంపై జీహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు, సిబ్బంది శ్రద్ధ చూపకపోవడం రంగుమారి ఎండిపోయాయి.
చెరువుకు ఇరువైపులా మొక్కలను నాటి సూదరంగా తీర్చిదిద్ది పర్యటక ప్రాంతంగా మార్చి, ప్రజలు సేద తీరేందుకు ఉపయోగపడాలని కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. అందులో భాగంగా లోకల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. కానీ ఆప్రణాళికలు ఎక్కడ కనపడడం లేదు.
ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మొక్కలను సంరక్షించకుండా బాధ్యతరహితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, వృధాగా నాటకుండా వదిలేసిన మొక్కలను ఇతర ప్రాంతాలకు తరలించి, లేదా స్థానిక బస్తీల్లో నాటి ఎండకుండా చూడాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. భవిష్యత్తరాలకు మంచి పర్యవరాన్ని అందించి ఆహ్లదకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
About The Author
Advertise

Related Posts
