వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం
న్యూ ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి
On
అనంతరం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ
వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓ బోర్గె బ్రెండీ. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.
"గత ఏడాది కాలంలో తెలంగాణ అసాధారణ పురోగతి సాధించింది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా ఎదుగుతోంది. దీని వెనుక రహస్యమేంటి?” అని బ్రెండీ ప్రశ్నించగా, “కష్టపడి పని చేయడం, అందరి మద్దతే విజయానికి మూలం” అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న Telangana Rising 2047 లక్ష్యాలను అభినందిస్తూ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని బ్రెండీ హామీ ఇచ్చారు.
About The Author
Advertise

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2025 10:59:44
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు
ప్రధాన అతిథులు గా ఎంపీ కొండ...