#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
ముఖ్యఅధితిగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం పరిధిలోని వాగ్దేవి హై స్కూల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో కళకళలాడాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు, నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద గౌడ్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యా రంగంలో క్రమశిక్షణతో పాటు సాంస్కృతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయ్ ధరణి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మద్దెల సాయిబాబా మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పాఠశాల ముందుకు సాగుతోందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.

ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Publisher
Namasthe Bharat
