హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

ఇంటికో మనిషి ఊరి కో బండి ఖమ్మం రండి

On

100 సంవత్సరాల పూర్తి సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ

 సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు 

పాలమాకుల జంగయ్య ప్రజలకు కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జనవరి 04,జనవరి 18న ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఇంటికి ఒక మనిషి ప్రతి ఊరికి ఒక బండి మాట్లాడుకుని కార్మిక వర్గం కష్టజీవులు చలో ఖమ్మం కార్యక్రమానికి రావాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్స్ ను ఈరోజు శంషాబాద్ మండలం కేంద్రంలోని జిల్లా కార్యాలయం ఆవరణలో గోడపత్రికలను విడుదల చేశారు. 

 

WhatsApp Image 2026-01-04 at 7.16.53 PMఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో జనవరి 18న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భారతదేశంలో సిపిఐ ఏర్పడిన తర్వాత రాజరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని ఆయన అన్నారు.నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేసి నిజం సర్కారులకులదోసి ప్రజాస్వామ్య పరిపాలన కోసం అశువులు బాపిన వీరులు ఎందరో కమ్యూనిస్టులే అని ఆయన తెలిపారు. బాంచను దొర నీ కాళ్లు మొక్కుతా అని పిలిచే కాలము నుండి తలెత్తుకొని తిరిగే కాలం వైపు సమాజం నడిచింది అంటే అది కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితమే అని ఆయన అన్నారు. 
 జాతీయ ఉద్యమంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని నాటినుండి నేటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక వర్గ పోరాటాలకు ప్రజా పోరాటాలకు సిపిఐ పార్టీ నాయకత్వం వహించి నిర్వహించిందని అన్నారు.పోస్టర్స్ విడుదల కార్యక్రమంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్ రావు సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు టి రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు 6 యాదగిరి, పల్నాటి యాదయ్య, భారతరాజు, నరసింహ, మండల కార్యదర్శి కే చంద్ యాదవ్, కందుకూరు మండల కార్యదర్శి రాజు. జిల్లా సమితి సభ్యులు సక్రు నాయక్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ కొండల్ జెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise