జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి: టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ కుత్బుల్లాపూర్
మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టెల మల్లేశం, గడ్డమీది అశోక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం షాపూర్ నగర్ ఉషోదయ టవర్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్లస్థలాలు కేటాయించాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ అధికారులు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని తెలిపారు. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ఎమ్ప్యానల్ మెంట్లో చేర్చాలి, వ్యాపార ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని వివరించారు. జిల్లాల్లో మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్కడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో
టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి అమరేందర్ గౌడ్, సహాయ కార్యదర్శి పి.శంకర్, చిన్నబాబు, బాలరాజు, చైతన్య రెడ్డి, రఫియూద్దీన్ ఖాద్రి, రమేష్, కొండల్ రెడ్డి, పర్వేజ్ ఆహ్మద్, లింగారెడ్డి, సంతోష్ రెడ్డి, సౌభాగ్యవతి తదితరులు పాల్గొన్నారు
