#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!

మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులకు వినతి..!!

On

  • అధికారులు కు పిర్యాదు చేసిన
  • డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 
  • శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్

మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, టి. సంతోష్ రెడ్డి S/o సుధాకర్ రెడ్డి మున్సిపల్ అనుమతులు లేకుండానే జనచైతన్య కాలనీ, ప్లాట్ నెం.63 (సై.నెం.44) వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు.

IMG_20260105_221343

సాయంత్రం వేళల్లో హోటల్ వద్ద మత్తు పానీయాలు, ముఖ్యంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, దీంతో కాలనీలో భయం, ఆందోళన నెలకొంటున్నాయని పేర్కొన్నారు. కాలనీవాసులను బెదిరిస్తూ, రాజకీయ నాయకులు, దుండగులు, న్యాయవాదుల మద్దతు తనకు ఉందని చెప్పి ఎవరూ తనకు ఏమీ చేయలేరని ప్రగల్భాలు పలుకుతున్నాడని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తానని బెదిరింపులు చేస్తున్నాడని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, GHMC కమిషనర్లు, పోలీసు అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తూ, కాలనీవాసులపై నిరాధార ఆరోపణలతో నోటీసులు జారీ చేయించడంలో సంతోష్ రెడ్డి పాలుపంచుకుంటున్నాడని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్, శ్రీ సాయి నగర్ కాలనీ, బీకేఎన్ క్లెవ్ సహా పరిసర ప్రాంతాల గృహ నిర్మాణదారులను లక్ష్యంగా చేసుకుని సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

అక్రమాలకు సహకరిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. సంతోష్ రెడ్డి నివాస గృహ యజమాని మూర్తి (బీకేఎన్ క్లెవ్) మరియు హోటల్ వ్యాపార సముదాయ యజమాని మల్లేశ్వరి కూడా సహకరిస్తున్నారని ఆరోపిస్తూ వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, కాలనీవాసులకు రక్షణ కల్పించాలని మున్సిపల్, పోలీసు అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ ఫిర్యాదు కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. జ్ఞాన శేఖర్, ఉపాధ్యక్షుడు వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి పి. పూర్ణానందం, మాజీ అధ్యక్షుడు ఎం. శివయ్య, శ్రీ సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కాలనీవాసులు వెంకటేష్, శ్రీనివాస్, వెల్డింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise