Tag
GHMC
హైదరాబాద్ 

GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ

GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ రామంతపూర్ భగయత్ కాలనీ, వెంకట సాయి నగర్, సాయి కృష్ణ కాలనీలో బీరప్ప దేవాలయం వెనుక లైన్‌లో సాంక్షన్ అయిన బాక్స్ కల్వర్ట్ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి ప్రశ్నించగా, “బాక్స్ కల్వర్ట్ మరోచోట వేస్తాం” అని సర్కిల్-2 ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
Read More...
Telangana 

BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ

BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ కూకట్ పల్లి మండలంలోని అంబిర్ చేరువు వద్ద బతుకమ్మ నిమజ్జనలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోపోవడం పై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.
Read More...
Telangana 

Rabies : పెరుగుతున్న కుక్క కాటు మరణాలు

Rabies : పెరుగుతున్న కుక్క కాటు మరణాలు రాష్ట్రంలో కుక్కకాటు మరణాలు కొనసాగుతున్నాయి. రేబిస్ వాక్సిన్ అవగహన లోపం కూడా అందుకు కారణం. పలు మున్సిపాలిటీ పరిధిల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండడం, వచ్చి పోయే వారిపై దాడికి పాలుపడి, అవికరావడం సర్వ సాధారణం అయ్యింది. ఇంట్లో పెంచుకునే శునకాలు, రోడ్డు పై స్వైర విహారం చేస్తున్న డాగ్స్ యొక్క  గోరు తగిలిన,  వాటి...
Read More...
మేడ్చల్ 

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్
Read More...
హైదరాబాద్ 

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది....
Read More...
హైదరాబాద్ 

ప్రమాదాల నుండి రక్షించండి

ప్రమాదాల నుండి రక్షించండి కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ రోడ్డు సరైన డివైడర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు యాక్సిడెంటులు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం అయ్యేంతవరకు ఎదురుచూడకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కు కలిసి వినతి పత్రం...
Read More...
హైదరాబాద్ 

అధికారులు ఉన్నట్లా, లేనట్లా!

అధికారులు ఉన్నట్లా, లేనట్లా! గాజులరామారం డివిజన్ రావినారాయణ రెడ్డి నగర్ నుండి గాలి పోచమ్మ బస్తికి వెళ్లే దారిలో డ్రైనేజీ పనులు చెయ్యలేదని అక్కడి స్థానికులు రోడ్డుకు అడ్డంగా మట్టి పోసి, రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే, ఈ విషయం సదరు కాంట్రాక్టర్ మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికి తమకేమి పట్టనట్లు వ్యవహరించడం, పనిచేయించకుండా నిమ్మకు నీరేతినట్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దింతో...
Read More...
హైదరాబాద్ 

అక్రమ నిర్మాణాలను తొలగించాలి

అక్రమ నిర్మాణాలను తొలగించాలి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని  అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు. అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్  కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.  కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి,  తదితరులు పాల్గొన్నారు.
Read More...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.!

ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.! 70-80 గజల్లో వెలుస్తున్న 6 అంతుస్తుల భవనాలు  జిహెచ్ఎంసి చట్టం 1955  ఇక్కడ వర్తించదా అంటూ స్థానికులు ఫైర్  పరోక్షంగా నిర్మాణాలకు సహకారం అందిస్తున్న అధికారులు అక్రమ భవనాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు   ఎల్లమ్మబండ ప్రాంతంలో జిహెచ్ఎంసి చట్టం 1955 వర్తించదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది కూకట్పల్లి సర్కిల్ 24 టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల వ్యవహార శైలిని చూస్తుంటే. కండ్ల ముందు అక్రమ నిర్మాణమని తెలిసినా… ఏం చేయలేని.. చేతగాని స్థితిలో ఉంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలని ఎవరైనా ఫిర్యాదు చేసిన, ఇటు మున్సిపల్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కంటి తుడుపు చర్యగా నోటీసు ఇస్తూ ఆ తర్వాత నిర్మాణానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఫలితంగా పిల్లర్‌తో మొదలై.. జీ+6 అంతస్తు వరకు వచ్చినా.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కండ్లు మూసుకుంటున్నది. కూకట్పల్లి జోనల్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే.. కూకట్పల్లి 0సర్కిల్‌ 24 ఆల్విన్ కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండలోని నాగార్జున స్కూల్ ఎదురుగ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా దాదాపు 80 గజాల స్థలంలో రెండు అక్రమ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. రోడ్డుపైకి  3 ఫీట్ల స్లాబును విస్తరించి జీ+6 నిర్మిస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడలేని దుస్థితిలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉంది.  ఈ విషయం స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగానికి తెలిసిన, ఒకవేళ ఎవరైనా జోనల్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. లాభం లేకుండాపోతుందని, స్లాం అంటూ వెనుకేసుకొని వస్తారని ఆరోపణలు ఉన్నాయి. కంటి తుడుపు చర్యగా నోటీసులు జారీ చేస్తారు తప్ప  అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోవడంపై అనేక విమర్శలు చేస్తున్నారు ఎల్లమ్మబండ వాసులు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చి వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.     
Read More...

Advertisement