కుంగ్ ఫు,కరాటే విద్యలతోనే ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం

On
కుంగ్ ఫు,కరాటే విద్యలతోనే ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం

 

ఆడపిల్లలకు కుంగ్ ఫు , కరాటే తోనే భద్రత

ప్రతి మహిళా, ప్రతి ఆడపిల్ల కుంగ్ ఫు , కరాటే పై ఆసక్తి పెంపొందించుకోవాలి.

మాజీ  సైనికుడు బ్లాక్ బెల్ట్ గ్రహీత భూషణ్ పటేల్  

నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 02:నేటి సమాజంలో ఆయా రంగాలలో మహిళలూ ఉన్నత రంగాలలో రాణిస్తూ దేశాన్ని ఏలే స్థాయికి చేరుకున్నారు. కానీ నేటి సమాజంలో కొందరు మహిళలూ ఇప్పటికి తమను తాము రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు కుంగ్ ఫు , కరాటే వంటి యుద్ధ కళలు ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా తమను తాము రక్షించుకునే నైపుణ్యాన్ని అందిస్తాయని అన్నారు మాజీ సైనికుడు బ్లాక్ బెల్ట్ గ్రహీత భూషణ్ పటేల్. విపత్కర పరిస్థితులలో ధైర్యంగా వ్యవహరించి, తమను తాము రక్షించుకోవడంలో యుద్ధ విద్యాలు కీలకంగా  ఉపయోగపడతాయని ఈ కళలు శిక్షణ తీసుకోవడం ద్వారా మానసికంగా కూడా బలపడతారని ఒత్తిడిని తగ్గించుకోవడం, ఏకాగ్రతను పెంపొందించుకోవడం మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం,ఆడపిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సమాజంలో వారి స్థాయిని పెంచడానికి కూడా దోహద పడతాయని అన్నారు. ప్రతి తల్లితండ్రులు తమ తమ ఆడపిల్లలను కుంగ్ ఫు నేర్పించి వారిని శక్తివంతులుగా తయారయ్యేలా చూడాలి. షాద్ నగర్ పట్టణం లోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్స్ బాలరాజ్, అహ్మద్ ఖాన్ అధ్యర్యంలో ఎంతోమంది ఈ కళను నేర్చుకొని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు సాధించారు. కావున మీరు కూడ నేర్చుకొని ఆత్మవిశ్వాసం తో దృడంగా ఉండాలని కోరారు.

Tags

Share On Social Media

Latest News

Advertise