కౌలు రైతుల పత్తి పంటను కాల్చిన దుండగులను వెంటనే పట్టుకోవాలి
బికేఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య డిమాండ్
నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్01:జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలో చేగిరెడ్డి ఘనపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతులు గోవర్ధన్ రెడ్డి జనార్దన్ రెడ్డి లు కలిసి పొలం కౌలుకు తీసుకొని పత్తి పంట వేసి ఆరుకాలం కష్టించి పెట్టుబడి పెట్టి పండించిన పంటను ఎన్నో ఇబ్బందులు పడి తీయించి ఇంట్లో నిల్వ ఉంచితే ఓరువలేని మనసు చెల్లించిన దుండగులు నిప్పు పెట్టి కాల్చివేయడం అనేది హీనమైన చర్యని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి పంట చేసినప్పటి నుంచి పంట కోతకొచ్చే వరకు రైతు పడే కష్టం అంత ఇంత కాదు తీరా పంట చేతికొచ్చిన తర్వాత ఇలాంటి గాత్కాలకు పాల్పడి కాల్చి బూడిద చేయడమనేది మంచి పద్ధతి కాదు అని ఆయన అన్నారు ఏమైనా కక్షలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని లేదా చట్టపరంగా పోవచ్చు చేతికొచ్చినలక్షలువిలువచేసె పంటను కాల్చి బూడిద చేసి మానసిక ఆనందం పొందే వారిని చాడిస్టులు అంటారు ఇలాంటి చాడిజానికిపాలుపడ్డ దుండగులు ఎవరో కనుక్కొని వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని వారికి చేయూతనివ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
