గ్రామ సర్పంచ్ అనూష దామోదర్, గుడి చెర్మన్ పసుపుల ప్రశాంత్‌కు ఘన సన్మానం

On
గ్రామ సర్పంచ్ అనూష దామోదర్, గుడి చెర్మన్ పసుపుల ప్రశాంత్‌కు ఘన సన్మానం

 

నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్01:పసుపుల మల్లేష్  ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో, నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీమతి అనూష దామోదర్ ని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అదే కార్యక్రమంలో గుడి చెర్మన్‌గా నూతనంగా ఎన్నికైన పసుపుల ప్రశాంత్ ని కూడా ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొత్త పదవులను స్వీకరించిన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పసుపుల రాములు, పసుపుల రాజేష్, శ్రీను, నర్సింలు, వెంకటయ్య, రవి శంకర్ నాయక్, మల్లయ్య తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags

Share On Social Media

Latest News

Advertise