అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

On
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

 

ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్న

కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విట్యాల మంజుల నరసింహ

నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 05: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విట్యాల మంజుల నరసింహ అన్నారు. శుక్రవారం గ్రామంలో ని వార్డుల్లో పర్యటించి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మంజుల నరసింహ మాట్లాడుతూ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని వివరించారు. గ్రామం నుండి రామేశ్వరం వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయించడం కాకుండా ఐమాస్ట్ లైట్లు సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికే గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం కాకుండా అంత్యక్రియలకు సైతం ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు. గ్రామ ప్రజలందరూ తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్నా మీ ఓటు నాకే వేయండి.. అక్క.. తమ్ముళ్లు.. చెల్లెలు మీ అమూల్యమైన ఓటు హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించాలని ఓటర్లను సర్పంచ్ అభ్యర్థి వేడుకున్నారు. ప్రజా సమస్యలే పరమావధిగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నానని.. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఓటర్ దేవుళ్లను వేడుకున్నారు. గతంలో తాను ఎంపీటీసీగా పోటీ చేశానని.. రాజకీయ అనుభవం ఉంది అని.. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించేందుకు కృషి చేయాలని ఓటర్ మహాశయులను వేడుకున్నారు. సర్పంచి పదవిని దక్కించుకునేందుకు ఇతర రాజకీయ పార్టీల నేతలు ఎన్నో మాయమాటలు చెబుతుంటారని వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని.. మీకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను వేడుకున్నారు. తాత నీ ఓటు నాకే వెయ్యి.. అవ్వ మీ అమూల్యమైన ఓటును వేసి మీ మనవరాలు మంజులను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags

Share On Social Media

Latest News

కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
  :- (సిఐటియు)  పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న
వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు 
అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?
గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

Advertise