కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు 

On
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు 

 

సర్పంచ్ ఎన్నికల వేల రావిర్యాల గ్రామ కాంగ్రెస్ కు షాక్ 

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో గులాబీ తీర్థం తీసుకున్న రావిర్యాల కాంగ్రెస్ నాయకుడు 

నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్02:సర్పంచ్ ఎన్నికలవేల కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. జిల్లేడు చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమ్మరి శివకుమార్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ సమక్షంలో గులాబీ తీర్థం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్ర సంక్షేమ సారధి, రైతుల పక్షపాతి కేసీఆర్ నాయకత్వంపై బలమైన నమ్మకం ఉందని భావనతో గులాబీ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాయాని, రైతులు సంతోషంగా జీవనం సాగించారని పేర్కొన్నారు. గ్రామాలలో సైతం సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ప్రకటనలను, వాగ్దానాలను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, సకల జనులకు సంక్షేమం అందించాలని ఉద్దేశంతో కేసీఆర్ పదేళ్లపాటు  పరితపించారని, ఇందులో భాగంగానే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, బీసీ బందు  వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, రావిర్యాల బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నీల నర్సింలు, నాయకులు వెంకటేష్, చిల్ల వెంకటయ్య, జహంగీర్, కృష్ణయ్య, పురుషోత్తం, భీమయ్య, నర్సింలు, చిప్ప నిజలింగం తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise