ఎయిడ్స్ వ్యాధి యొక్క ప్రమాదం ఇంకా ఉంది జాగ్రత్త..! 

On
ఎయిడ్స్ వ్యాధి యొక్క ప్రమాదం ఇంకా ఉంది జాగ్రత్త..! 

 

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన

 డాక్టర్ వి విజయలక్ష్మి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ 

నామస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 01:ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఈరోజు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి.విజయలక్ష్మి గారు జండా ఊపి ప్రారంభించారు. తదుపరి హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు ఎయిడ్స్ ర్యాలీ యొక్క స్లోగన్లు చెబుతూ ర్యాలీని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి చౌరస్తా దాకా తీసుకో  వెళ్లారు.
 స్లొగన్స్ 
1). డిసెంబర్ ఫస్ట్ 
      ఎయిడ్స్ డే 
2). ఆరోగ్యమే ముద్దు 
    హెచ్ఐవి /ఎయిడ్స్ వద్దు 
3). చేయి చేయి కలుపుదాం 
    ఎయిడ్స్ ని నిర్మూలిద్దాం 
4).ఎయిడ్స్ నివారణ బాధ్యత 
   నాది, నీది, మన అందరిదీ 
5). నిశ్శబ్దని చేదిద్దాం 
   ఎయిడ్స్ గురించి చర్చిద్దాం మొదలగు నినాదాలతో ర్యాలీని నిర్వహించారు.షాద్ నగర్ చౌరస్తాలో మానవహారం చేసి ఎయిడ్స్ వ్యాధి గురించి డాక్టర్ వి విజయలక్ష్మి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ మాట్లాడారు 
ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి /ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన పెంచడం,  దాని వ్యాప్తిని అరికట్టడం .ఈ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకోవడం మరియు హెచ్ఐవి ఉన్నవారికి మద్దతు ఇవ్వడం అని డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు.ముఖ్యాంశాలు 
ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 1988లో పాటించారు ఇది తొలి అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం లో ఒకటిగా నిలిచింది.
ఎయిడ్స్ అంటే ఏమిటి.? అక్వైర్డ్ యుమినో డిఫిసియన్సీ సిండ్రోమ్ అనేది హ్యూమన్ ఇమ్యునో డిఫిషియన్సీ వైరస్ వల్ల కలిగే ఒక వ్యాధి, ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది అని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి/ ఎయిడ్స్ నివార చికిత్స మరియు సంరక్షణలో ఉరోగదని ప్రోత్సహించడం. ఈరోజు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ బాధ్యతలకు సంఘీభావం తెలిపేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు అని చెప్పారు.  యుక్త వయసు వారు  అందరూ సురక్షితమైన లైంగిక చర్యను పాటించాలి. కండోమ్ ను వాడాలి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారులు డాక్టర్ జగదీష్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఉష, డాక్టర్ బిందు, డాక్టర్ శ్వేత ,డాక్టర్ ప్రవీణ, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు శ్రీరామ, చంద్రకళ,  ఏఎన్ఎంలు,  ఆశలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల పారామెడికల్ ట్రైన్ ని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise