చింతకుంట తండా  సర్పంచ్ పదవికి నామినేషన్ శాఖలు వేసిన పాత్లావత్ శారద

On
  చింతకుంట తండా  సర్పంచ్ పదవికి నామినేషన్ శాఖలు వేసిన పాత్లావత్ శారద

 

ఒక్కసారి ఆశీర్వదించండి.... అభివృద్ధి పరుగులు పెట్టిస్తా...

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్29:జిల్లెడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా సర్పంచ్ పదవికి పాత్లావత్ శారద అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. శారద తో పాటు ఆమె కుమారుడు, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆకాష్ నాయక్ కూడా నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మద్దతు తెలిపారు. బి వి నామినేషన్ దాఖలు అనంతరం శారద మాట్లాడుతూ...గ్రామంలో అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవే మా లక్ష్యం. చింతకుంట తండా గ్రామపంచాయతీ, మెట్టుగడ్డ తాండ.గోలబండ తండా 
వేపకుచ్చ తాండ సంపూర్ణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని చెప్పారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని వివరించారు.
చింతకుంటలో నామినేషన్ దాఖలు సందర్భంగా ఉత్సాహం నెలకొంది. ప్రజల ఆశలు అభీష్టాలకు నిలువెత్తు ప్రతినిధిగా నిలుస్తామన్న నమ్మకంతో పాత్లావత్ శారద ముందుకు సాగుతున్నారు.గ్రామ అభివృద్ధికి తాము ఓటుతో పాలుపంచుకుంటామని  గ్రామస్థులు బారీగా మద్దతు తెలుపుతున్నారని స్పష్టం చేశారు.ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.యువత, మహిళలు, రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా గ్రామ పాలన ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసి, ప్రజల కోసం పని చేసే నిక్కసైన అభ్యర్థి శారద అభ్యర్థి అని ఆశాభావం వ్యక్తం చేశారు.నామినేషన్ దాఖలు సమయంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువత, స్థానిక నాయకులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tags

Share On Social Media

Latest News

Advertise