సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి జిల్లా కలెక్టర్
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో గల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం ఆమె నారాయణపేట మండలం లింగంపల్లిసదుపాయాలను గ్రామ సమీపంలో గల భాగ్య లక్ష్మి కాటన్ మిల్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన పత్తిని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న మౌలిక వసతి సదుపాయాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి రైతుతో మాట్లాడి పత్తి ని మిల్ కు ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించగా కపాస్ యాప్ ద్వారా స్లాట్ ను బుక్ చేసుకున్నానని, గురువారం స్లాట్ ఉండటంతో మిల్లుకు పత్తిని తీసుకుని వచ్చానని ఆ రైతు కలెక్టర్ కు తెలిపారు. రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేపట్టాలని, ప్రతిరోజు కొనుగోలు వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. అనంతరం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోని కాంటాను, డంపింగ్ లను చూశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యాలయ కార్యదర్శి,సూపర్ వైజర్, సీసీఐ అధికారులు,మిల్ యజమాని, రైతులు పాల్గొన్నారు.
