ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావసం కల్పించాలి జిల్లా కలెక్టర్
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరవాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి "మాతృత్వం ఒక వరం - అందుకు దత్తత మరో మార్గం"కు సంబందించిన వాల్ పోస్టర్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలను దత్తత తీసుకున్న నెలగా జరుపుకోవడం జరుగుతదని అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటారని తెలిపారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏటా థీమ్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంస్థాగతంగా లేని వారికి పునరావాసం కల్పించడమే ఉదేశ్యం అని ఆమె చెప్పారు.ప్రతి బిడ్డ ఇనీట్యూషన్ లోనే మగ్గి పోకుండా వారిని దత్తత ఇవ్వాలని, పిల్లలను అక్రమంగా కొనడం కానీ, అమ్మడం కానీ చేయకుండా చట్ట ప్రకారంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత వద్దు అనుకునే వాళ్ళు మహిళా శిశు సంఘక్షే శాఖ కార్యాలయాన్ని సంప్రదించి తమ పిల్లలను అప్పగించాలని సూచించారు. ఈ ఏడాది ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంస్థాగత పునరావాసం అనే థీమ్‌తో ఈ ప్రచారం జరుగుతుందని, దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడం, దత్తత గురించి ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించడం, దత్తత ద్వారా పిల్లలు, కుటుంబాలకు కలిగే సంతోషాన్ని చాటడమే అని వివరించారు. బాలల న్యాయ (బాలల రక్షణ మరియు సంరక్షణ) చట్టం, 2015 ప్రకారం చట్ట విరుద్దంగా పిల్లలను పెంచుకోవడం నేరమని, చట్ట విరుద్దంగా పిల్లలను దత్తత ఇచ్చినా.తీసుకున్నా.వారికి 3 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రుపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఏ ప్రయోజనం కోసం అయినా ఒక బాలుడు/బాలికను అమ్మడం కానీ కొనడం గానీ జరిగితే వారికి ఐదేళ్ళ వరకు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వమే కోర్టు ద్వారా చట్టబద్దంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
అంతే కాకుండా వైద్యశాల/నర్సింగ్ హోమ్/ప్రసూతి గృహంలో పని చేసే సిబ్బంది పై నేరానికి పాల్పడినట్లయితే వారికి విధించే జైలు శిక్షకాలం
3 సం||ల నుండి 7 సం॥ ల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ఇంటి వద్ద నుంచే దత్తత కోసం దరఖాస్తు www.cara.wcd.gov.in (or) www.missionvatsalya.wcd.gov.in చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు తమ పాన్ కార్డు, దంపతుల ఫోటోలు (4×6) సైజు - నివాసం ధృవీకరణ పత్రం (ఆధార్ కార్డు/ఓటర్ గుర్తింపు కార్డు/పాస్ పోర్టు/డ్రైవింగ్ లైసెన్స్ ) మరియు ఆదాయ ధృవీకరణ పత్రం (సాలరీ స్లిప్ / ఐటి రిటర్న్స్ ), వివాహ ధృవీకరణ పత్రం (రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి), జనన ధృవీకరణ పత్రాలు, (దంపతులిద్దరివీ) దంపతులిద్దరికీ ఎటువంటి దీర్ఘకాలిక లేదా ప్రాణాంతక వ్యాధులు లేవని దత్తతకు అర్హులని డాక్టర్ చేత పొందిన మెడికల్ సర్టిఫికేట్
జతపర్చీ దరఖాస్తు చేసుకొనే సమయంలో రూ॥6,000/- లను పాప/బాబును తీసుకొనేటప్పుడు రూ॥ 50,000/- లను ప్రభుత్వానికి డి.డి. రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. దత్తతకు సంబంధించిన మరింత సమాచారం కోసం శిశుగృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం నారాయణపేటను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్ర మోహన్, డీసీపీ ఓ కరిష్మా, ఆరోగ్య శాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.
