సత్య సాయిబాబా జయంతి శత జయంతి ఉత్సవాలు
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
మానవత్వానికి మారుపేరుగా సత్య సాయి బాబా నిలిచారని ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. ఆదివారం,సత్య సాయిబాబా జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఆదివారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో అధికారికంగా నిర్వహించారు. ప్రజావాణి హాల్లో భగవాన్ సత్యసాయి బాబా చిత్రపటానికి ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. సాయిబాబా చేసిన సేవలను కొనియాడారు. జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేసి తాగు నీటిని అందించిన మహనీయుడన్నారు. ప్రభుత్వం ఎలాగైతే ఉచిత పథకాలను అందిస్తుందో అలాగే భగవాన్ సత్య సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య వైద్యం ఇతర సేవకార్యక్రమాలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో శ్రీధర్, డి వై ఎస్ ఓ వెంకటేష్ , శివరాజ్, విజయ్ కుమార్ కనిగిరి, మాజీ కౌన్సిలర్ మారుతీ తదితరులు పాల్గొన్నారు.
