గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ. సీతాలక్ష్మి
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని నారాయణ పేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ. సీతాలక్ష్మి అధికారులకు సూచించారు.
గురువారం నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన పరిశీలకురాలికి స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లి మండలం నిడ్జిoత, మద్దూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఫిల్ ల్
గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆమె సూచించారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శెట్టి వెంకటేష్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
