జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్:ఎస్పీ డాక్టర్ వినీత్
On
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మార్గదర్శకత్వంలో నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను తేది:24న సోమవారం ఉదయం 9 గంటల నుండి జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల నుండి 24 యువకుల జట్లు, అదనంగా పోలీస్, మీడియా, రెవెన్యూ శాఖల ప్రత్యేక టీంలు పాల్గొనడం జరుగుతుంది.ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్లో యువతలో క్రీడాస్ఫూర్తి,శారీరక సౌష్టవం,జట్టు భావన లీడర్షిప్ లక్షణాలు పెంపొందించడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య సాన్నిహిత్యం మరింత బలపరచడం ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యం అని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.సమాజ అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, యువత అధికంగా క్రీడల్లో పాల్గొంటే చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండగలరని ఆయన పేర్కొన్నారు.
Tags
Related Posts
Latest News
24 Nov 2025 18:00:56
తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్
