అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశం.జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టి.జి. ఐపాస్ ద్వారా,పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుండి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.శనివారం కలెక్టర్ చాంబర్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు.ఎస్సీ 12, ఎస్ టి 4, పీహెచ్సీ 1లకు పెట్టుబడి సబ్సిడీ మంజూరు కు డిఐపిసి కమిటీ లో ఆమోదం తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎం లింగేశ్వర్ గౌడ్, ఐ.పి.ఓ.నర్సింగ్ రావు, ఎల్ .డి ఎం విజయ్ కుమార్ సీటిఓ ప్రవీణ్ కుమార్ ,యం.నరేశ్ అసిస్టెంట్ హైడ్రాలాజిస్ట్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ విద్యుత్ ఎస్సీ వెంకటరమణ ఎస్ఆర్ఓ కృష్ణ గౌడ్ సాయి తేజ రెడ్డి ఇరిగేషన్ ఈ ఈ బ్రహ్మానంద , కృష్ణ గౌడ్,డిపిఓ సుధాకర్ రెడ్డి లేబర్ శాఖ తిలక,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
