పిల్లలే రేపటి పౌరులు,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిమళపురంలో బాలల దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత ప్రథమ ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “నేటి పిల్లలే రేపటి పౌరులు” అని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో కూడా ముందుండాలని సూచించారు. చదువు ద్వారా ఏదైనా సాధించడం సాధ్యమని, చదువు చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలో యంగ్ ఒరేటర్స్ క్లబ్ (యోసి ) మిడ్-ఇయర్ షోకేస్‌ను కూడా నిర్వహించారు. విద్యార్థులు పిక్చర్, టాక్, షో & టెల్ , రోలు ప్లే వంటి యోసి కార్యకలాపాల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించగా, కలెక్టర్ వారు ఈ ప్రదర్శనలను సందర్శించి విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అలోకిట్ ఫౌండేషన్ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
