కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు
మండిపడ్డ బిజెపి నాయకులు కుమార్ యాదవ్
ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.
About The Author
Advertise

