కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం

3 వారాల్లో ఇంటి నెంబర్లు, డబల్ బెడ్ రూమ్ కాలనీలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా 

On
కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం

కీసర : మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలో నీ డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలతో విలవిలలాడుతున్న ప్రజలు. డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఏండ్లుగా సమస్యలు విలయతాండవం ఆడుతునేఉన్నాయి, కాలనీ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని అన్నారు.

IMG-20251030-WA0020

మా కాలనిలో కేవలం ఇండ్లు మాత్రమె ఉన్నాయని, కనీస మౌలిక వసతులు లేవని.ఇండ్ల పట్టాలు వచ్చాయి కానీ, డ్రైనేజీ, తాగునీరు,రోడ్లు కరెంట్ సమస్య,ఇంటి నెంబర్ లు లేవని, చీకట్లో ఎక్కడ ఏముందో తెలియక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.

డ్రైనేజీ ఇతర వాటన్నింటిని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అందరూ కలిసి దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం అందచేశారు.డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలపై కమిషనర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని,కనీస మౌలిక వసతులు కల్పనకు కృషిచేస్తామని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఇంటి నంబర్లు 3 వరాల లో ఇస్తామని తెలిపారు. కమిషనర్ హామీ ఇవ్వడంతో కాలనీ ప్రజలు కమిషనర్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు కొల బాల్ రాజ్ యాదవ్,నాయకులు బోడ శ్రీనివాస్,కొల మల్లేష్ యాదవ్,రమేష్ గౌడ్ కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

Share On Social Media

Latest News

Advertise